న్యూజెర్సీలో ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’ 100వ ఎపిసోడ్‌ ప్రదర్శన

మనసులో మాట పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రతి నెలా చివరి ఆదివారం ఆల్‌ ఇండియా రేడియోలో చేస్తున్న ‘మన్‌కీ బాత్‌’ వందో ఎపిసోడ్‌ అమెరికాలోనూ ప్రసారమైంది.

Published : 30 Apr 2023 20:09 IST

న్యూజెర్సీ:  ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మన్‌ కీ బాత్ (Mann ki Baat) వందో ఎపిసోడ్‌ను అమెరికాలోనూ ప్రదర్శించారు. కాన్సులేట్ జనరల్, ఫెడరేషన్ అఫ్ ఇండియన్ అసోసియేషన్ (FIA) అధ్వర్యంలో ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పలు సంస్థల నుంచి ప్రముఖులు, కార్యకర్తలు, ప్రవాస భారతీయులు.. ఇలా అర్ధరాత్రి సమయంలో దాదాపు 100 మంది ప్రధాని మన్‌కీ బాత్‌ను ఆలకించేందుకు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ పాల్గొనగా..  న్యూయార్క్‌ సెనెటర్‌ కెవిన్‌ థామస్‌, జెన్నీఫర్‌, ఎడిసన్‌ మేయర్‌ సామ్‌ జోషి, తరుణ్‌ జీత్‌సింగ్‌ తదితరులు హాజరయ్యారు. 

మనసులో మాట పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రతి నెలా చివరి ఆదివారం ఆల్‌ ఇండియా రేడియోలో చేస్తున్న ‘మన్‌కీ బాత్‌’ వందో ఎపిసోడ్‌ ఆదివారం ప్రసారమైంది. ఈ కార్యక్రమాన్ని కోట్ల మంది ప్రజలు వినేలా భాజపా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే . ఇందులో భాగంగానే అమెరికాలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రవాస భారతీయులు సైతం వినేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని