ఘనంగా పోలండ్‌ తెలుగు సంఘం (PoTA) ఆవిర్భావం

పోలండ్‌లో తెలుగు ప్రజల సంక్షేమం కోసం తొలిసారి అసోసియేషన్‌ ఏర్పాటైంది.

Published : 31 Mar 2023 20:36 IST

వార్సా: యూరోపియన్ యూనియన్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పోలండ్‌లో తెలుగు ప్రజల సంక్షేమం కోసం మొట్టమొదటి అసోసియేషన్ ప్రారంభమైంది. పోలండ్‌ తెలుగు అసోసియేషన్‌(PoTA-Poland Telugu Association) అనే లాభాపేక్షలేని ఈ సంస్థ ప్రారంభోత్సవం వార్సాలోని ఓ హోటల్‌లో ఘనంగా జరిగింది.  ఈ సంఘం ఏర్పాటుతో అక్కడ నివసిస్తున్న దాదాపు ఐదువేల మందికి పైగా తెలుగు ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గత రెండేళ్లుగా భారీ సంఖ్యలో తెలుగువారు విద్య, ఉపాధి అవకాశాల కోసం పోలండ్‌ వస్తుండటాన్ని గమనించి వారందరి కోసం ఓ సంస్థ ఉండాలని భావించి రావ్‌ మద్దుకూరి, హరిచంద్‌ కాట్రగడ్డ, విజయ్‌ మోహన్‌, చంద్రభాను అక్క PoTAను ఏర్పాటు చేశారు. అయితే, మార్చి 26న భారీ సంఖ్యలో హాజరైన తెలుగు ప్రజల ఆనందోత్సాహాల మధ్య PoTA ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. తెలుగువారి కోసం తొలిసారి ఏర్పాటు చేసిన ఈ సంఘం ఆవిర్భావ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమానికి హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.  కమ్మటి తెలుగు భోజనం, ఉగాది పచ్చడితో ఈ కార్యక్రమం సందడిగా సాగింది.

 

ఈ సందర్భంగా PoTA కార్యవర్గాన్ని ప్రకటించారు. మొదటి అధ్యక్షుడుగా అక్కల చంద్రభాను, ఉపాధ్యక్షురాలుగా శోభా కిరణ్, కోశాధికారిగా దిలీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించగా.. మధుమతి, శ్రీనివాస్, ప్రకాష్, రాజశేఖర్, ధుమంత రావు, శైలేంద్ర, ప్రవీణ్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి పోలండ్‌లోని ప్రముఖ ఇండియన్‌ గ్రాసరీస్‌ సంస్థ లిటిల్‌ ఇండియా, ఉషోదయా గ్రూప్‌నకు చెందిన ప్రియా ఫుడ్స్‌ సమర్పకులుగా వ్యవహరించాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని