
రేపు ప్రవాస భారతీయ దినోత్సవ సదస్సు
దిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రవాస భారతీయ దినోత్సవ సదస్సును ఈనెల 9న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సురినామ్ అధ్యక్షుడు చంద్రికా పెర్సాద్ సంతోఖీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ గురువారం తెలిపింది. ‘ఆత్మనిర్భర్ భారత్లో భాగస్వామ్యం’ అనే ఇతివృత్తం(థీమ్)తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. రెండు ప్లీనరీలుగా నిర్వహించే ఈ సదస్సు చివరిలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. సదస్సు సందర్భంగా 2020-21 సంవత్సరానికి గాను ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు విజేతల పేర్లను ప్రకటిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.