Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టాంజానియాలో పాదయాత్ర

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో ఉంటున్న తెలుగువారు పాదయాత్ర చేపట్టారు. 

Published : 17 Sep 2023 22:28 IST

దారుస్సలాం: తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో ఉంటున్న తెలుగు వారు ఆందోళన చేపట్టారు. దారుస్సలాంలోని జింఖానా గ్రౌండ్స్‌ నుంచి ప్రారంభించి ఓషియన్‌ రోడ్‌ వరకు పాదయాత్ర కొనసాగించారు. ‘బాబుతో నేను’ పేరిట ఉన్న ప్లకార్డులను చేతబట్టుకొని పాదయాత్ర చేశారు. కేవలం ఏపీలో మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు చేస్తున్న వారికి మద్దతు పలికారు. జాతీయ స్థాయి నాయకులు సైతం ఆయన అరెస్టును ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఈ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు కర్ణాటక, పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ప్రవాసీయులు సైతం పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని