
తానా సౌజన్యంతో ఆక్సీమీటర్లు, మెడికల్ కిట్ల పంపిణీ
ఇంటర్నెట్డెస్క్: కరోనా కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమవంతు సాయం చేస్తున్నారు. తాజాగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో పల్స్ ఆక్సీమీటర్లు, మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా మాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్ కరోనా పేషెంట్లకు ఉచితంగా మెడికల్ కిట్లు అందించారు. అదేవిధంగా వైద్య సిబ్బందికి పల్స్ ఆక్సీమీటర్లు ఇచ్చారు.
తానా వారి సౌజన్యంతో వీటిని అందించినట్లు డాక్టర్ వెంకటేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, వాసిరెడ్డి అర్జునరావు, నెల్లూరు రవి, మాదాల రామారావు, చిలువేరు బుచ్చి రామయ్య,ఆరోగ్య పర్యవేక్షకుడు భాస్కరరావు, మరియా రాణి, సీహెచ్వో సుభాషిణి, ఆరోగ్యమిత్ర రాఘవ, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.