‘క్వాలిటీ మాట్రిక్స్‌’ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో మెగా వైద్య శిబిరం

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో క్వాలిటీ మ్యాట్రిక్స్ అధ్యక్షురాలు ప్రియాంక వల్లేపల్లి, శశికాంత్ వల్లేపల్లి స్పాన్సర్‌షిప్‌తో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు......

Published : 06 Apr 2022 20:12 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ గచ్చిబౌలిలో క్వాలిటీ మ్యాట్రిక్స్ అధ్యక్షురాలు ప్రియాంక వల్లేపల్లి, శశికాంత్ వల్లేపల్లి స్పాన్సర్‌షిప్‌తో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఐటీ ప్రొఫెషనల్స్ ఫోరం, స్వేచ్ఛ- సీసీసీకి చెందిన కిరణ్ చంద్రలు నిర్వహించారు. గచ్చిబౌలితోపాటు పరిసర ప్రాంతాల్లోని బస్తీల్లో నివసించే దాదాపు 400 మంది భవన నిర్మాణ కార్మికులు, ఇతరులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్డియాలజీ, పిడియాట్రిక్స్, గైనకాలజీ, ఈఎన్‌టీ, ఆప్టోమెట్రీ విభాగాలకు సంబంధించిన వైద్య పరీక్షలను వైద్యులు నిర్వహించారు. దాదాపు 400 మందికి రక్త పరీక్షలు, ఈసీజీ, ఎకో, షుగర్ వంటి పరీక్షలు చేశారు. అందరికీ  6 నెలలకు సరిపడా విటమిన్ టాబ్లెట్స్‌తో పాటు సంబంధింత మందుల్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వాలంటీర్లను ప్రియాంక వల్లేపల్లి అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని