ఛార్లెట్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ మీటింగ్‌ విజయవంతం

ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. నార్త్‌ కెరొలినా రాష్ట్రం ఛార్లెట్‌లో ఘనస్వాగతం లభించింది.

Published : 03 Sep 2023 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అమెరికా పర్యటనలో భాగంగా ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు నార్త్‌ కెరొలినా రాష్ట్రం ఛార్లెట్‌లో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయనతో పలువురు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వర్కింగ్ డే అయినప్పటికి దాదాపు 200 మంది ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిథి రఘురామ కృష్ణంరాజును నాగ పంచుమర్తి ఆహ్వానించి పరిచయం చేయగా, ఠాగూర్‌ మల్లినేని ఈ సమావేశానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురు నాయకులు రఘురామ కృష్ణంరాజును పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. 

కార్యక్రమానికి వచ్చినవారితో రఘురామ కలివిడిగా మాట్లాడుతూ, కుశల ప్రశ్నలు వేస్తూ ఉత్సాహంగా కనిపించారు. వేదికపై రఘురామ కృష్ణంరాజు ఎప్పటిలాగే గోదావరి వాళ్ల స్టయిల్లో ప్రసంగించి ఆకట్టుకున్నారు. వైఎస్‌ జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అథోగతి పాలైన విషయం, వైకాపా ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిన విధానం, ఫేక్‌ ఉచిత తాయిలాలు తదితర అంశాల గురించి వివరించారు. తన నియోజకవర్గం నరసాపురం వెళ్లడానికి వైకాపా ప్రభుత్వం సృష్టిస్తున్న ఇబ్బందుల గురించి కూడా చెప్పారు.

2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం వంటి విషయాలపై కూలంకుషంగా కార్యక్రమంలో వివరించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటమి తప్పదని ఈ సందర్భంగా రఘురామ స్పష్టం చేశారు. నాగ పంచుమర్తి, ఠాగూర్‌ మల్లినేని, బాలాజి తాతినేని, సతీష్‌ నాగభైరవ, శ్రీమాన్ రావి, సురేష్ కొత్తపల్లి తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు