
Published : 15 Apr 2021 12:27 IST
ఫిన్లాండ్ తెలుగు సంఘంఅధ్యక్షుడిగా రఘునాథ్
ఆత్మకూరు : ఫిన్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షుడిగా నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం నల్లరాజుపాళెంకు చెందిన పార్లపల్లి రఘునాథ్ ఎన్నికయ్యారు. ప్రజల జీవన ప్రమాణాల పరంగా ప్రపంచంలో ఎప్పుడూ ముందుండే ఈ దేశంలో 2000 మంది వరకు తెలుగు ప్రజలు ఉన్నారు. ఫిన్లాండ్లో తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయలను పరిరక్షించేందుకు 2008లో ఈ సంఘం ఏర్పడింది. 2021 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఉగాది సందర్భంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష ఉపాధ్యక్షులుగా పార్లపల్లి రఘునాథ్, జ్యోతి స్వరూప్, సుబ్రమణ్యమూర్తి ఎన్నికయ్యారు. తెలుగు పండుగల నిర్వహణ, తెలుగు భాషను నేర్పే కార్యక్రమాలు ఈ సంఘం చేపడుతోంది.
Tags :