తానా ట్రెజరర్‌గా రాజా కసుకుర్తి ఎన్నిక

అమెరికాలో తెలుగు సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ట్రెజరర్‌గా కృష్ణాజిల్లాకు చెందిన రాజా కసుకుర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  గతంలోనూ ఆయన తానాలో కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ వంటి పదవుల్లో పనిచేశారు.

Published : 14 Jul 2023 16:19 IST

వాషింగ్టన్‌: అమెరికాలో తెలుగు సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ట్రెజరర్‌గా కృష్ణాజిల్లాకు చెందిన రాజా కసుకుర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  గతంలోనూ ఆయన తానాలో కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ వంటి పదవుల్లో పనిచేశారు. కృష్ణాజిల్లా బావులపాడు మండలం వీరవల్లిలో జన్మించిన రాజా కసుకుర్తి ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తానా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించారు. కమ్యూనిటీ కో ఆర్డినేటర్‌గా తెలుగు విద్యార్థులకు ఉపయోగపడేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. గత డిసెంబర్‌, జనవరి నెలలో తానా చైతన్యస్రవంతి కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఉచిత కంటి చికిత్సతో పాటు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, వృద్ధులకు రగ్గులు, రైతులకు అవసరమైన పరికరాలను అందజేశారు.  ట్రెజరర్‌గా ఎన్నికైన నేపథ్యంలో తానా నిధుల వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేస్తానని రాజా కసుకుర్తి తెలిపారు. ఆయన ఎన్నిక పట్ల కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు  వీరవల్లి గ్రామస్థులు, ఆయన మిత్రులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు