తెదేపా జోన్-2 సమన్వయకర్తగా రవి మందలపు నియామకం

పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలను జోన్‌ -2గా నిర్ణయించిన తెదేపా.. ఆ జోన్‌కు సమన్వయకర్త (కోఆర్డినేటర్‌)గా రవి మందలపును నియమించింది.

Published : 25 Jul 2023 17:02 IST

అమరావతి: పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలను జోన్‌ -2గా నిర్ణయించిన తెదేపా.. ఆ జోన్‌కు సమన్వయకర్త (కోఆర్డినేటర్‌)గా రవి మందలపును నియమించింది. జోన్‌ 2లో అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు తదితర నియోజకవర్గాలున్నాయి. ఈ జోన్‌ పరిధిలో మొత్తం 32మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇటీవల జరిగిన తానా 23వ మహాసభల సందర్భంగా జరిగిన ఎన్నారై తెదేపా- యూఎస్‌ఏ సమావేశంలో తెదేపా నేత డాక్టర్‌ రవి వేమూరు రవి మందలపు నియామకంపై ఎన్నారైలకు తెలియజేశారు. జోన్‌-2 సమన్వయకర్తగా రవి మందలపును తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నియమించారని చెప్పారు. తన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన రవి మందలపు.. తెదేపా విజయానికి శాయశక్తులా కృషిచేస్తానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని