ఒహాయో డేటన్ హిందూ దేవాలయంలో వైభవంగా రుద్ర, చండీ హోమాలు

ఒహాయో బీవర్‌క్రీక్ హిందూ దేవాలయంలో సెప్టెంబర్ 17 నుండి 19 వరకూ ప్రపంచ శక్తి దినోత్సవం పురస్కరించుకుని లోకక్షేమం కోసం

Published : 30 Sep 2021 20:23 IST

ఒహాయో బీవర్‌క్రీక్ హిందూ దేవాలయంలో సెప్టెంబర్ 17 నుండి 19 వరకూ ప్రపంచ శక్తి దినోత్సవం పురస్కరించుకుని లోకక్షేమం కోసం మహా రుద్రం, శత చండీ హోమాలు ఘనంగా నిర్వహించారు. జీఆర్‌డీ అయ్యర్ గురుకుల్‌ వ్యవస్థాపకులు రమేష్ నటరాజన్, గాయత్రి నటరాజన్ ఆధ్వరంలో జరిగిన ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కన్నుల విందుగా, శ్రవణానందంగా సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమాలు, పూజలు చేయటం విశేషం.

ఈ సందర్భంగా గాయత్రి నటరాజన్ మాట్లాడుతూ ‘యావత్ జగత్తుకి కేంద్ర బిందువైన దేవిని శక్తి రూపంలో పూజించడం ఈ ప్రపంచ శక్తిదినోత్సవం ముఖ్య ఉద్దేశం. గతంలో సహస్ర సువాసిని పూజ, శత చండీ హోమం, ఆన్‌లైన్ ద్విసహస్ర చండీపారాయణం  గురుకుల్ ఆధ్వర్యంలో నిర్వహించాం. ఈ సంవత్సరం డేటన్ దేవాలయం వారి సమన్వయంతో ఒక  పండుగగా చేసుకోవడం చాలా సంతోషమైన విషయం’’ అని అన్నారు. 1331 మార్లు రుద్రం, 121 చమకములు, మహన్యాసం, రుద్ర క్రమం, 100సార్లు శ్రీ దుర్గా సప్తశతి, 134 రుద్ర హోమాలు, 10 చండీ హోమాలు, హర హర మహాదేవ , జై చండీ నినాదాలతో మార్మోగిన ప్రాంగణం దివ్యానుభూతిని కలిగించింది. ఇందుకు ఎంతో శ్రమించిన గురుకుల్  సభ్యులు, ముఖ్యంగా మహిళా సభ్యులు పాల్గొనటం గర్వకారణంగా ఉందన్నారు. గురుకుల్ సభ్యులందరి తరపున డేటన్ హిందూ దేవాలయ నిర్వహణ వర్గం వారికీ, కార్యవర్గ సభ్యులకు, హాజరైన భక్తులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇక ముందు కూడా గురుకుల్ ఇలాంటి కార్యక్రమాలు ఇతర దేశాలలో కూడా జరుపుకోనున్నట్లు తెలిపారు.

డేటన్ హిందూ దేవాలయం ప్రెసిడెంట్ హేమ పండ్రంగి మాట్లాడుతూ ‘డేటన్ హిందూ దేవాలయం 1976 నుంచీ బేవర్‌క్రీక్ పరిసర ప్రాంతాలలో హిందూ ధార్మిక కార్యక్రమాలకు ఒక శక్తి కేంద్రంగా రూపుదిద్దుకుని అత్యంత  భక్తిశ్రద్ధలతో పూజ, సేవా కార్యాలను నిర్వహిస్తునట్లు తెలిపారు. ప్రపంచ శక్తి దినోత్సవం ఈ ఆలయ ప్రాంగణంలో జరగడం అందునా రమేష్, గాయత్రి, వారి శిష్యబృందము అద్భుత మంత్రోచ్ఛారణతో హోమాలతో ఆలయాన్ని, భక్త జనులను ఉత్తేజ పరిచడం మరచిపోలేని అనుభూతి అని అన్నారు. ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా జరుపుకోడానికి సహకరించిన తన తోటి కార్య వర్గం,  వాలంటీర్లు, దాతలు, కళాకారులు, ఆలయ సిబ్బంది అండగా నిలిచిన భక్తులకు విశేష కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts