America: పిట్స్‌బర్గ్‌ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో సహస్ర కలశాభిషేకం

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌లో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆగస్టు 10 నుంచి 14 వరకు సహస్ర కలశాభిషేకం, నక్షత్ర శాంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు...

Updated : 16 Aug 2022 23:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌లో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆగస్టు 10 నుంచి 14 వరకు సహస్ర కలశాభిషేకం, నక్షత్ర శాంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 25 మంది అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్ర పఠనం, శాంతి మంత్ర జపాలు నిర్వహించారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణతో దేవస్థాన ప్రాంగణం ప్రతిధ్వనించింది. అమెరికాలో తొలి దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన అక్కడ... గత 47 సంవత్సరాలుగా ఉత్సవాలు, కుంబాభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేయడానికి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఈ ఐదురోజుల కార్యక్రమాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కళ్యాణ్ శీలంనేని, శ్రావణ్ చిన్నల, చంద్ర భోనగిరి, దేవస్థానం అధ్యక్షుడు గంగాధర్ నాగబండి, కార్యదర్శి చంద్రశేఖర్, ప్రెసిడెంట్ శర్వన, కోశాధికారి రాజి శ్రీనివాసన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పిట్స్ బర్గ్ దేవస్ధానం నిర్వహిస్తున్న వివిధ విశిష్ట కార్యక్రమాల గురించి https://svtemple.org వెబ్ సైట్‌లో తెలుసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని