డాలస్‌లో నేత్రపర్వంగా సహస్రగళ భగవద్గీత పారాయణం

అమెరికాలోని డాలస్‌ నగరం భగవద్గీత పారాయణంతో పులకించింది. ఆగస్టు 13న సాయంత్రం 4గంటలకు డాలస్‌లోని అల్లెన్‌ ఈవెంట్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన......

Updated : 15 Aug 2022 16:05 IST

డాలస్‌: అమెరికాలోని డాలస్‌ నగరం భగవద్గీత పారాయణంతో పులకించింది. ఆగస్టు 13న సాయంత్రం 4గంటలకు డాలస్‌లోని అల్లెన్‌ ఈవెంట్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 1500 మందికి పైగా హాజరై సహస్రగళ సంపూర్ణ భగవద్గీత పారాయణంలో పాల్గొన్నారు. శ్రీ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి సారథ్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మక కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. తొలుత అల్లెన్‌ ఈవెంట్‌ సెంటర్‌కు విచ్చేసిన స్వామీజీకి దత్త యోగా సెంటర్‌, గీతా టీమ్‌ సభ్యులు ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసిన స్వామీజీ.. శ్రీకృష్ణ భగవానుడికి పూజలు నిర్వహించి సహస్ర గళాన్ని ఆరంభించారు. ఒకే వేదికపై నుంచి వేల మంది భగవద్గీత శ్లోకాలను పఠించడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. అయితే, ఈ కార్యక్రమం గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటుదక్కించుకోగా.. దీనికి సంబంధించిన ప్రశంసా పత్రాన్ని గణపతి సచ్చిదానంద స్వామీజికి ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా భగవద్గీతను పఠించేలా పిల్లల్ని ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు స్వామీజీ ఆశీస్సులు తెలిపారు. పిల్లలకు ఇదో గొప్ప బహుమతి అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని