
ఏప్రిల్ 3న ‘తెలుగు తల్లి కెనడా’ సాహిత్య సభ
టొరంటో: తెలుగుతల్లి కెనడా, టొరంటో తెలుగు టైమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 3న ఉగాది తెలుగు సాహిత్య సభ జరగనుంది. శనివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 4 గంటల వరకు) ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల కృష్ణ దేశికాచారి, నవీన్ చంద్ర నెల్లుట్ల, శ్రీరామం దగ్గుబాటి తదితరులు ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ రెండు సంస్థలు కెనడా నుంచి మొదటిసారిగా నిర్వహిస్తున్న పూర్తి రోజు సాహిత్య సభ ఇదేనని తెలిపారు. సాహిత్య ప్రసంగాలు, కవి సంగమం, కథా సమయం, జానపద గేయ గానం, సరదా క్విజ్ వంటి వైవిధ్యభరిత కార్యక్రమాలతో కళకళలాడే ఈ సభకు అందరినీ ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని https://youtu.be/JLf5JBxYyaE లింక్ ద్వారా వీక్షించవచ్చని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.