సాయిరాం యేరువ దాతృత్వం... YKR స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌

ప్రవాస భారతీయుడు సాయిరాం యేరువ ఏటా అందించే YKR ఉపకారవేతనాలను ఈ నెల 17న పంపిణీ చేశారు. 

Updated : 17 Jul 2023 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్: చదువుకునే రోజుల్లో తాను పడ్డ కష్టం.. ఎవరికీ రాకూడదని ఓ వ్యక్తి చేస్తున్న కార్యక్రమం 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ వ్యక్తే... పెదపలకలూరుకు చెందిన సాయిరాం యేరువ. గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఆయన 51 పాఠశాలల్లో ఉపకార వేతనాలు అందిస్తున్నారు. ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా ఈ నెల 17న పలకలూరులో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 

ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం YKR స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను గుంటూరు నగర పరిధిలోని పెదపలకలూరుకు చెందిన సాయిరాం యేరువ కుటుంబం ప్రారంభించింది. తండ్రి కోటి రెడ్డి జ్ఞాపకార్థం సాయిరాం 2012లో దీనిని స్థాపించారు. ప్రవాస భారతీయుడైన సాయిరాం మిత్రుల సహాకారంతో ఏటా ఈ స్కాలర్ షిప్‌లను అందిస్తున్నారు. చిన్నతనంలో చదువు విషయంలో సాయిరాం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఆయన ప్రతిభను గుర్తించి దాతలు స్కాలర్‌షిప్‌లు ఇచ్చారు. అలా విద్యనభ్యసించి 1997లో ఉద్యోగం రావడంతో అమెరికా వెళ్లిపోయారు. అప్పట్లో పలకలూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండేది. హైస్కూల్ కోసం గ్రామంలో విద్యార్థులు గుంటూరు వరకు వెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో YKR జిల్లాపరిత్ ఉన్నత పాఠశాలను స్ధాపించారు. 

గుంటూరుతోపాటు పల్నాడు, ప్రకాశంలోని విద్యార్థులకు కూడా సాయిరాం ఉపకారవేతనాలు అందిస్తున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులను దత్తత తీసుకొని స్కాలర్‌షిప్‌లను అందించేలా పథకం రూపొందించారు. ఈ క్రమంలో సుమారు 11,208 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నారు. నాలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 22 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, పది మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూళ్లు, 12 ఎయిడెడ్‌ హైస్కూళ్లు, మూడు ప్రైవేటు పాఠశాలలకు ఏటా ఒక్కో పాఠశాలకు రూ.36 వేలు చొప్పున మొత్తంగా 51 పాఠశాలలకు ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు