Updated : 17 Jan 2021 06:11 IST

సింగపూర్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

సింగపూర్‌: సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ(టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో ఇంటింటా సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఆన్‌లైన్‌ వేదికగా శనివారం నిర్వహించిన ఈ వేడుకల్లో వేలాది మంది తెలుగు వారు పాల్గొనగా.. సొసైటీ సభ్యులు వారికి పండుగ ప్రాముఖ్యతను వివరించారు. గాలిపటాలు, గొబ్బెమ్మల తయారీతో పాటు, చిత్ర లేఖనం, పాటలు, నృత్యాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. దీంతోపాటు ముగ్గుల పోటీలు నిర్వహించి ఆన్‌లైన్‌ ఓటింగ్ ద్వారా విజేతలను ఎన్నుకుని బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన హరిదాసు వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సింగపూర్ కాలమాన ప్రకారం జ్యోతిష్యులతో ప్రత్యేకంగా ముద్రించిన క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఏటా సంబరాలు నిర్వహించుకునేందుకు సహకారం అందిస్తున్న వారికి టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షులు నీలం మహేందర్‌, ప్రధానకార్యదర్శి బసిక ప్రశాంత్‌ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా రోజా రమణి, సునీతరెడ్డి, గోనె రజిత, కల్వ లక్ష్మణ్ రాజు, ప్రవీణ్ మామిడాల, రవి కృష్ణ విజాపూర్, సహ వ్యాఖ్యాతగా కూర సంతోషి వ్యవరించారు. సొసైటీ సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, గింజల సురేందర్ రెడ్డి, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివరామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ సంబరాల్లో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. 


 

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని