Ladies day: రాయల్‌ ఆస్కాట్‌ ‘లేడీస్‌ డే’లో చీరల్లో మెరిసిన మహిళలు

బ్రిటన్‌లో జరిగే ‘లేడీస్‌ డే’సందర్భంగా భారతీయ మహిళలు చీరకట్టులో మెరిశారు.

Published : 19 Jun 2022 20:38 IST

లండన్‌: బ్రిటన్‌లో జరిగే ‘లేడీస్‌ డే’సందర్భంగా భారతీయ మహిళలు చీరకట్టులో మెరిశారు. దాదాపు 1000మంది మహిళలు చీర కట్టుకుని ఈ వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాయల్‌ ఆస్కాట్‌లో జరిగే ఈ వేడుకలకు సాధారణ పురుషులు సూట్‌లోనూ, మహిళలు రకరకాల టోపీలు ధరించి హాజరవుతారు. ఈ క్రమంలో భారతీయ సంప్రదాయం ప్రతిబించేలా చేసేందుకు యూకే చెందిన వైద్యురాలు దీప్తి జైన్‌ ఈ ఆలోచన చేశారు. ‘ఈ రోజు చీరలే మాట్లాడతాయి’ అని దీప్తి జైన్‌ అన్నారు. భారతీయ వస్త్రాలను, చేనేత కార్మికులకు మద్దతుగా చీరను ధరించి ఈ వేడుకలకు హాజరైనట్లు ఆమె తెలిపారు.  చీరకట్టులో వచ్చిన మహిళలతో ఫొటోలు దిగేందుకు బ్రిటిష్‌ మహిళలు పోటీ పడ్డారు. రాయల్‌ ఆస్కాట్‌ వేడుకలను క్వీన్‌ అన్నే 1711లో ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని