America: అమెరికాలోని సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర విగ్రహ ప్రతిష్ఠాపన

అమెరికా షిరిడీగా పేరున్న సాయిదత్త పీఠంలోని శ్రీ శివవిష్ణు ఆలయంలో జనవరి 16న శనీశ్వర విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. 

Published : 18 Jan 2023 14:22 IST

ఎడిసన్‌: అమెరికా షిరిడీగా పేరున్న సాయిదత్త పీఠంలోని శ్రీ శివవిష్ణు ఆలయంలో జనవరి 16న శనీశ్వర విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఈ ప్రతిష్ఠాపన వేడుకలో ప్రవాసులంతా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయిదత్త పీఠం వ్యవస్థాపక ఛైర్మన్ రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

అంతేకాకుండా.. స్వామియే శరణం అయ్యప్ప అనే శరణుఘోషతో ఆలయ పరిసరాలు మారుమోగిపోయాయి. అమెరికాలో తెలుగువాళ్లు అత్యధికులు ఉండటంతో వాళ్లలో కూడా కొంతమంది ఈ అయ్యప్పస్వామి దీక్ష తీసుకున్నట్లు ఛైర్మన్ రఘుశర్మ శంకరమంచి తెలిపారు. దీక్ష తీసుకున్న వారంతా మేరీల్యాండ్‌లోని శ్రీ శివ విష్ణు టెంపుల్‌లోని అయ్యప్పస్వామిని దర్శించుకొని దీక్షలు విరమించారు. ఎడిసన్‌లోని సాయిదత్త పీఠంలో శంకరమంచి రఘుశర్మ నేతృత్వంలో అయ్యప్పస్వాములు ఇరుముడి కట్టుకొని ఆ ఆలయంలోని సమస్త దేవతలను దర్శించుకొని మేరీల్యాండ్‌కు బయలుదేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని