పంద్రాగస్టు వేళ ‘సింగపూర్ తెలుగు సమాజం’ రక్తదాన శిబిరం

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే  సింగపూర్ తెలుగు సమాజం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది......

Published : 25 Aug 2021 19:29 IST

సింగపూర్‌: సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బ్యాంకు వద్ద రక్తదాన శిబిరం నిర్వహించి దేశభక్తిని చాటుకుంది. ఎన్నో ఏళ్లుగా సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు. కరోనా విపత్తు సమయంలోనూ తెలుగు సమాజం వరుసగా ఐదోసారి విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషం. 

ఈ రక్తదాన శిబిరానికి అద్భుతమైన స్పందన వచ్చినప్పటికీ కొవిడ్‌ నిబంధనలతో ముందుగా నమోదు చేసుకొన్న 100 మందికి మాత్రమే అవకాశం కల్పించినట్టు నిర్వాహకులు తెలిపారు. కరోనా టీకా తీసుకున్న వారికి కాలపరిమితి నిబంధనలు ఉండటంతో చాలామంది రక్తదానం చేయలేకపోయారన్నారు. అలాంటి వారితో పాటు రక్తదానం చేయదలచిన ఇతర దాతలు తరువాత రోజుల్లో కూడా  RO284 కోడ్ ఉపయోగించి రక్తదానం చేయాలని నిర్వాహకులు జూనెబోయిన అర్జునరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సింగపూర్ తెలుగు సమాజనికి రెడ్ క్రాస్ సొసైటీ,  బ్లడ్ బ్యాంక్‌ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కొవిడ్‌ కష్టకాలంలో ముందుకు వచ్చి రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి, కార్యదర్శి సత్య చీర్ల ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని