Published : 24 Jan 2022 22:16 IST

Sunitha : బాలభారతి పాఠశాలకు గాయని సునీత విరాళం

ఓర్వకల్లు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు పొదుపు మహిళలు స్వయంశక్తితో నిర్మించి, నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు ప్రముఖ గాయని సునీత లక్ష రూపాయల విరాళం అందించారు. గత అక్టోబర్ నెలలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి ఆహ్వానం మేరకు బాలభారతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన సునీత.. భవిష్యత్తులో బాలభారతి పాఠశాలకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఆర్థిక సహకారంతో పాటు సునీత తల్లి, ప్రముఖ సంగీత గురువు ఉపద్రష్ట సుమతి బాలభారతి పాఠశాలలోని విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచితంగా సంగీత పాఠాలు నేర్పిస్తున్నట్లు ఓర్వకల్లు పొదుపు సంఘం నిర్వాహకురాలు విజయభారతి తెలిపారు. సునీత అందిస్తున్న సహకారానికి బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని