సీతారామ కల్యాణంతో పరవశించిన డుర్హం

కెనడా ఒంటారియో రాష్ట్రంలోని పికెరింగ్ నగరం శ్రీ సీతారాముల నమ జపంతో పరవశించి పోయింది. డుర్హం తెలుగు క్లబ్ వారు.......

Published : 25 Apr 2022 20:04 IST

పికెరింగ్‌: కెనడా ఒంటారియో రాష్ట్రంలోని పికెరింగ్ నగరం శ్రీ సీతారాముల నమ జపంతో పరవశించి పోయింది. డుర్హం తెలుగు క్లబ్ వారు శ్రీ నర్సింహా చార్యుల సారథ్యంలో సీతారామ కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. డుర్హం వాస తెలుగు ప్రజలంతా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి తరలివచ్చి జానకిరాముల ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంటారియో రాష్ట్ర ఆర్థిక మంత్రి పీటర్ బెత్లెన్ఫాల్వయ్, వితబీ నగర ఉప మేయర్‌ ఎలిజిబెత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పీటర్ మాట్లాడుతూ.. సీతారాముల జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు. ప్రపంచమంతా వసుధైక కుటంబమన్న ఆయన.. కెనడా దేశమే అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతిని కాపాడుకుంటున్నందుకు తెలుగువారిని ఉప మేయర్‌ ఎలిజిబెత్‌ అభినందించారు. వన్ వరల్డ్- వన్ ఫ్యామిలీ నినాదంతో అంత కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు.

ముఖ్య అతిథులిద్దరూ డుర్హం తెలుగు క్లబ్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుల్ని అభినందించి సత్కరించారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి డీటీసీ ప్రెసిడెంట్ నర్సింహారెడ్డి, కార్యవర్గ సభ్యులు రవి మేకల, శ్రీకాంత్‌ సింగిసేతి, వెంకట్‌ చిలివేరు, రమేశ్‌ ఉప్పాలపాటి, వాసు, గుణ, శేఖర్‌ రెడ్డి, కమలమూర్తి, శివ, యువి చెరుకూరి తదితరులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని