వేడుకగా ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ తృతీయ వార్షికోత్సవం
గత మూడు సంవత్సరాల్లో వివిధ రంగాలలో 50కు పైగా విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహించి తెలుగు భాషకు పట్టం కట్టిన ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ తృతీయ వార్షికోత్సవ వేడుకలు అద్వితీయంగా జరిగాయి.
సింగపూర్: గత మూడు సంవత్సరాల్లో వివిధ రంగాలలో 50కు పైగా విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహించి తెలుగు భాషకు పట్టం కట్టిన ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ తృతీయ వార్షికోత్సవ వేడుకలు అద్వితీయంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు డా. రామ్ మాధవ్, విశిష్ట అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత, తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అర్ధ శతాబ్ది సాంస్కృతిక మూర్తి, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన సందేశాలను అందించారు.
సంస్థను, నిర్వాహకులను అభినందిస్తూ భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, ప్రఖ్యాత సినీ రచయిత భువనచంద్ర, పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ కూడా సంస్థ కార్యక్రమాలను కొనియాడారు.
ఈ సందర్భంగా సింగపూరు తెలుగు టీవీ వారి ఆధ్వర్యంలో చిన్నారులతో తెలుగు నీతిపద్యాల పోటీ ధారావాహిక మొదటి భాగాన్ని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు విడుదల చేసి మాట్లాడారు. తెలుగు భాష, భారతీయ సంస్కృతులకు మరింత వన్నె తేవడానికి కృషి చేస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి ప్రయత్నాలను అభినందించారు. ‘ఆవకాయ శతకము’, ‘కోనసీమ శతకములలోని’ పద్యాలలో కొన్ని ఆలపించి శ్రోతలను ఉర్రూతలూగించారు. మైకు గురించి ‘మైకాష్టకం’ అంటూ హాస్యభరితంగా చెప్పిన విషయాలు ఆహ్వానితులందరినీ నవ్వులతో ముంచెత్తాయి. అలాగే ‘తెలుగోళ్ళం తెలుగోళ్ళం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళం’ అంటూ స్వయంగా రచించి పాడిన పాటకు సభ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది.
ఒక మంచి దృఢ సంకల్పంతో సంస్థను స్థాపించి, సమాజానికి, భాషకు, సంస్కృతికి సేవచేయాలనే పట్టుదలతో ప్రయత్నం చేస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ మరో వందేళ్ళు పాటు ఇలా తెలుగులు విరజిల్లుతూ వృద్ధిచెందాలని ముఖ్య అతిథి డా. రామ్ మాధవ్ ఆశీస్సులు అందించారు. భారతీయత తెలుగుదనము మేళవించిన ఒక మంచి సమాజాన్ని తెలుగు రాష్ట్రాలలో నిలబెట్టాలని కృషిచేస్తున్న ఈ శ్రీ సాంస్కృతిక కళాసారథి వంటి సంస్థలు అదే లక్ష్యంతో పని చేయడం చాలా సంతోషదాయకమన్నారు. సమాజం తన కాళ్ళ మీద తాను నిలబడాలని, తనను తాను నడిపించుకోవడమే భారత ఆత్మనిర్భరత అన్నారు. కళలు, సాహిత్యం భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తాయని, ప్రపంచం ముందు భారతదేశాన్ని ఉన్నతంగా నిలబెడుతుంది అని వ్యాఖ్యానించారు.
‘భగవంతుని అనుగ్రహంతో, పెద్దల దీవెనలతో, అందరి ప్రోత్సాహంతో, మూడు సంవత్సరాల మా ఈ ప్రయాణంలో మీ అందరి మన్ననలను పొందడం మా సంస్థ అదృష్టంగా భావిస్తున్నాము. మా ఈ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు తెలిపిన అతిథులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. రాధిక మంగిపూడి సభానిర్వహణ చేయగా, శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో సింగపూర్ లో నివసించే కళాకారులతో కూచిపూడి, కథక్, జానపద నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య సంకీర్తనాలాపన, తెలుగు పద్య పఠనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.
గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, వంశీ కృష్ణ శిష్ట్లా సాంకేతిక నిర్వహణా బాధ్యతలు అందించగా, కుమార్, మోహన్, మౌక్తిక, సునీత, రాధికా, రాజి, రేణుక మరియు ప్రసన్న తదితరులు వాలంటీర్ గా సహకారము అందించారు.
GIIS, టింకర్ టాట్స్ మొంటోసిరి, Cow&Farmer, ఈగ జ్యూస్, శబ్ద కాన్సెప్ట్స్, SNM డెవెలెపేర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ (భీమవరం), టెర్రాన్ స్పేస్ (హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీ), Proponex రాజశేఖర్ ఆర్థిక సహకారం అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం