
సింగపూర్‌లో శత చండీ మహా యాగం
ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం, కొవిడ్ మహమ్మారి పూర్తిగా అంతం కావాలని కోరుతూ సింగపూర్‌లోని వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో చండీహోమం నిర్వహించారు. స్థానిక మహామారియమ్మన్ ఆలయంలో అంగరంగ వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా ఈ యాగం చేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, మంగళ ఆశీర్వచనాలు ఇచ్చారు.వాసవీ క్లబ్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గొట్లూరి, కార్యదర్శి నరేంద్ర కుమార్ నారంశెట్టి సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు కోర్ కమిటీ సభ్యులైన రాజశేఖర్ గుప్తా, ముక్కా కిషోర్, ముకేష్ భూపతి, మురళి పబ్బతి, సేవాదళ్ సభ్యుడైన నరేష్ యాద తదితరులు సహకరించారు.
.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.