బర్మింగ్‌హామ్‌లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ నగరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. 

Updated : 02 Apr 2023 15:42 IST

బర్మింగ్‌హామ్‌: యూకేలోని బర్మింగ్‌హామ్‌లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూబింగ్లీ హాలులో నిర్వహించిన ఈ వేడుకలకు యూకే వ్యాప్తంగా దాదాపు 3వేల మందికి పైగా తెలుగు ప్రజలు తరలివచ్చారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వేదపండితులు ముకురాల సిద్ధార్థ శర్మ,  బర్మింగ్‌హామ్‌ నుంచి మారుతి శ్రీనివాస్‌, శివ కోటమర్తి సీతారామ కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.  అక్కడ నివసిస్తున్న ప్రవాస తెలుగు కుటుంబాలు ఇంటిల్లిపాది సంప్రదాయ వస్త్రధారణలో ఈ కార్యక్రమంలో మెరిశారు.  మహిళలు, చిన్నారులు కోలాటాలతో సందడి చేశారు.  మంథనికి చెందిన  బ్రహ్మశ్రీ రంగి సత్యనారాయణ ప్రవచనాలు చేశారు.  సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించి అంతా సందడిగా గడిపారు. ఈ వేడుకలకు వచ్చిన అందరికీ ప్రసాదాలు పంపిణీ చేశారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు