Chicago: షికాగో హిందూ దేవాలయ సందర్శనలో శ్రీశైల దేవస్థానం బోర్డు సభ్యుడు

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం బోర్డు సభ్యులు గుద్దేటి నరసింహారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా షికాగోలోని హిందూ దేవాలయం ‘హిందూ టెంపుల్‌ ఆఫ్‌ గ్రేటర్‌ షికాగో’ను సందర్శించారు....

Published : 28 Aug 2022 23:12 IST

షికాగో: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం బోర్డు సభ్యులు గుద్దేటి నరసింహారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా షికాగోలోని హిందూ దేవాలయం ‘హిందూ టెంపుల్‌ ఆఫ్‌ గ్రేటర్‌ షికాగో’ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా వారికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్‌లోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మల్లికార్జున దేవస్థానం బోర్డు సభ్యులు మొట్టమొదటిసారి ఈ ఆలయానికి విచ్చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆలయ మాజీ అధ్యక్షులు భీమారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇదొక సుహృద్భావ పర్యటన అని, ఇక్కడి వాలంటీర్లలో చైతన్యాన్ని నింపిందని మరో మాజీ అధ్యక్షులు గోపాల్‌ శ్రీనివాసన్‌ అన్నారు.

ఈ సందర్భంగా నరసింహారెడ్డి.. శ్రీశైలం స్వామి సన్నిధి నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన శాలువలతో భీమారెడ్డి, గోపాల్‌ శ్రీనివాసన్‌, నాటా బోర్డు సభ్యుడు లింగారెడ్డిగారి వెంకటరెడ్డి తదితరులను సత్కరించారు. ప్రసాదాన్ని అందజేశారు. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించాల్సిందిగా అభ్యర్థించారు. కార్యక్రమంలో ఆలయ మాజీ ఉపాధ్యక్షులు మెట్టుపల్లె జయదేవరెడ్డి, షికాగో వైఎస్సార్‌సీపీ నేత కె.సత్యనారాయణరెడ్డి, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ షికాగో అధ్యక్షుడు పరమేశ్వరరెడ్డి, కార్యవర్గ సభ్యులు రమాకాంత్‌రెడ్డి, తానా ప్రతినిధులు కృష్ణమోహన్‌, హెచ్‌టీజీసీ వాలంటీర్‌ కమిటీ అధ్యక్షుడు శివ దేసు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, లలితారెడ్డి, సత్యవతి శ్రీనివాసన్‌, శారద తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు