
TANA: తానా అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు
వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తానా అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలిపై ఆయన విజయం సాధించారు. కర్నూలు జిల్లాకు చెందిన నిరంజన్.. అమెరికాలోని మిషిగన్‌లో నివాసముంటున్నారు. తానా ఎన్నికల్లో గెలుపుతో నిరంజన్ ప్యానల్ సంబరాల్లో మునిగిపోయింది.
చాలా ఆనందంగా ఉంది: జై తాళ్లూరి
తానా తదుపరి అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ఎన్నికవడం చాలా ఆనందంగా ఉందని ప్రస్తుత అధ్యక్షుడు జై తాళ్లూరి అన్నారు. టీం నిరంజన్ ప్యానల్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు జై తాళ్లూరి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తానాలో గెలుపోటములు ఉండవని.. బరిలో దిగిన ప్రతి వాళ్లూ గెలిచినట్టేనని చెప్పారు. ఎన్నికల్లో పాల్గొన్నందుకు నరేన్ కొడాలి టీంకు ఆయన అభినందనలు చెప్పారు. తానా అభ్యున్నతకి అందరూ కలిసి పనిచేస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. తానా ఆధ్వర్యంలో మరెన్నో కార్యక్రమాలు చేపట్టి ఇటు అమెరికా.. అటు భారత్‌లో ఎందరికో ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.