TAMA: పన్నుల అంశంపై తామా-రియల్ ట్యాక్స్ అల్లీ సెమినార్
తెలుగు అట్లాంటా తెలుగు సంఘం-రియల్ ట్యాక్స్ అల్లీ పన్నుల అంశంపై నిర్వహించిన సెమినార్‌కు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.
అమెరికా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా)-రియల్ ట్యాక్స్ అల్లీ సంయుక్త ఆధ్వర్యంలో పన్ను చట్టాల్లో మార్పులు, ఆర్థిక ప్రణాళికపై సదస్సు విజయవంతంగా జరిగింది. అల్ఫారెట్టా GAలోని డేసనా మిడిల్ స్కూల్‌లో జరిగిన ఈ సదస్సుకు 140మందికి పైగా హాజరయ్యారు. పన్ను చట్టాల్లో మార్పులకు సంబంధించిన అనేక అంశాలపై రియల్ ట్యాక్స్ అల్లీ సంస్థ సీఈవో హరిప్రసాద్ వివరించారు. వ్యక్తిగత, వ్యాపారవేత్తలకు సంబంధించిన పన్ను చట్టాల్లో మార్పులతో పాటు పన్నుల్లో కోత, ట్యాక్స్ క్రెడిట్స్, ట్యాక్స్ సేవింగ్ సంబంధిత వ్యూహాలను అందరికీ సరళంగా అర్థమయ్యేలా వివరించి ప్రశంసలు అందుకున్నారు.
తామా కార్యదర్శి శ్రీనివాస్ రామిశెట్టి ఈ కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సెమినార్ ట్యాక్స్ ఫైలింగ్‌తో పాటు అనేక క్లిష్టమైన అంశాలను అర్థంచేసేందుకు, పొదుపు చేయడం ద్వారా వచ్చే ఉపయోగాల గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు నిర్వహించినట్టు తెలిపారు. బోర్డు ఛైర్మన్ సుబ్బారావు మద్దాలి మాట్లాడుతూ.. తామా నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వివరిచండంతో పాటు తెలుగు కమ్యూనిటీ కోసం అనేక ఈవెంట్లు చేపడుతున్నట్టు చెప్పారు. ఈ సెమినార్ ద్వితీయార్థంలో ఇటీవల ప్రకటించిన పన్ను సంస్కరణలపై చర్చించారు. ఈ సంస్కరణల వల్ల కలిగే లాభనష్టాలను హరిప్రసాద్ అందరికీ సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ఈ సెషన్‌లో పాల్గొన్న వారిలో కొందరు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారు.
అనంతరం అధ్యక్షుడు సాయిరాం కారుమంచి తామా సభ్యుల్ని వేదికపైకి ఆహ్వానించి ముఖ్యంగా ఏప్రిల్ 8న జరిగే ఉగాదితో రాబోయే రోజుల్లో నిర్వహించబోయే కార్యక్రమాలను వివరించారు. అలాగే, ఆ సంస్థకు ఎంతోకాలంగా మద్దతుదారులుగా ఉన్న శ్రీకాంత్ మాదినేని, శేషగిరిరావు మండవతో పాటు చంద్రశేఖర్ మైలవరపును వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరంతా తామాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సంస్థ చేస్తోన్న కార్యక్రమాలను ప్రశంసించారు. అనంతరం తామా బృందం వీరిని సన్మానించింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
అన్ని వయసుల్లో ఉన్నవారికి ఉపయోగపడేలా తామా పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. ఉచిత వైద్య శిబిరాలు, పండగలు, సాహిత్య, సాంస్కృతి కార్యక్రమాలు, స్పోర్ట్ మీట్‌లు, విద్య, శిక్షణా కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు, మహిళలు, యువతను ప్రోత్సహించేలా పలు ఈవెంట్లతో పాటు రక్తదాన శిబిరాలు, వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటుందని నిర్వాహకులు తెలిపారు. తమ సంస్థ కార్యకలాపాల గురించి తెలుసుకొనేందుకు www.tama.orgవెబ్‌సైట్‌ను సందర్శించొచ్చని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: డేటా చోరీ కేసు.. వినయ్ ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మంది సమాచారం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Panaji: 10ఏళ్ల బాలుడి సాహసం.. నీటిలో మునుగుతున్న స్నేహితులను కాపాడి..
-
Politics News
MP Laxman: కేసీఆర్ కుటుంబ కలలు కల్లలుగానే మిగిలిపోతాయ్: ఎంపీ లక్ష్మణ్
-
Politics News
Modi - Rahul: కాంగ్రెస్ ర్యాలీ వాయిదా..ఒకేరోజు మోదీ, రాహుల్ మీటింగ్స్
-
Politics News
CM KCR: నా రాజకీయ జీవితమంతా పోరాటాలే: సీఎం కేసీఆర్