‘తామా’ ఎడ్యుకేషన్ సెమినార్‌కు అనూహ్య స్పందన
తామా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) నిర్వహించిన ఎడ్యుకేషన్ సెమినార్‌కు విశేష స్పందన లభించింది. స్థానిక కమ్మింగ్‌లోని షారన్ కమ్యూనిటీ భవనంలో....
అమెరికా: తామా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) నిర్వహించిన ఎడ్యుకేషన్ సెమినార్‌కు విశేష స్పందన లభించింది. స్థానిక కమ్మింగ్‌లోని షారన్ కమ్యూనిటీ భవనంలో జులై 22న నిర్వహించిన ఈ సెమినార్‌కు 200 మందికి పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది తరలిరావడంతో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేలపై టార్పాలిన్ పట్టాలు వేసి విద్యార్థులు కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. జీవితంలో విద్య ఆవశ్యకతను వివరిస్తూ విద్యారంగ నిపుణురాలు డాక్టర్ వాణి గడ్డం చేసిన ఈ వివరణాత్మక సెమినార్ విద్యార్థులకు ఎన్నో మంచి విషయాలను ప్రస్తావించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. విద్యకు సంబంధించిన సెమినార్‌ను నిర్వహించిన తామా ప్రతినిధులను పలువురు ప్రశంసించారు. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. తామా బహుముఖమైన, అన్ని వయసుల వారికి ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, యువతకు తగిన రీతిలో ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్తోందని తామా ప్రతినిధులు తెలిపారు.
ఆగస్టు 13న ‘తామా వీక్లీ ఫ్రీ క్లినిక్ వాక్’, తదుపరి అనేక కార్యక్రమాలు చేయనున్నారు. మరిన్ని వివరాలకు www.tama.orgని సందర్శించాలని కోరారు. ఏవైనా సందేహాలు ఉంటే info@tama.orgకి మెయిల్ చేయొచ్చని సూచించారు. తామా అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి తొలుత అందరికీ స్వాగతం పలికి, డాక్టర్ వాణిని వేదికపైకి ఆహ్వానించారు. ఉపాధ్యక్షులు సురేష్ బండారు ఆమెను సభకు పరిచయం చేశారు. కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు ఉన్న అవకాశాలు, నాయకత్వ లక్షణాలు, రీసెర్చ్, ఇంటర్న్‌షిప్ ఆప్షన్‌ల వరకు ఆమె అనర్గళంగా విశదీకరించారు. ఎస్‌ఏటీ, ఏసీటీ వంటి ప్రామాణిక పరీక్షలు, ఏపీ, ఐబీ, డ్యూయల్ ఎన్‌రోల్‌మెంట్ & కాలేజీ ఎంపికల వివరాలను ఇచ్చారు. కమ్యూనిటీ సర్వీస్ యాక్టివిటీస్ ఆమె స్పృశించిన మరో ఆసక్తికరమైన అంశం. ఈ సెమినార్ వల్ల ఎన్నో ప్రయోజనకర విషయాలు తెలుసుకోవడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చదువు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడనుంది. తామా బృందం డాక్టర్ వాణిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సెమినార్‌కు హాజరైన అందరికీ నిర్వాహకులు అల్పాహారం, పానీయాలు అందజేశారు.
స్పాన్సర్లు, మద్దతుదారులను సాయిరామ్ వేదికపైకి పిలిచి వారు చేసే పనుల గురించి మాట్లాడాలని కోరారు. వీలైనప్పుడల్లా వారికి ప్రయోజనకరంగా ఉండాలని తామా వారు ఎప్పుడూ అభిలషించడం స్వాగతించాల్సిన విషయమని తెలిపారు. అలాగే, తామా చేస్తోన్న పలు కార్యక్రమాలు, వాటి ఉపయోగాలను ఆయన వివరించారు. వీక్లీ తామా ఫ్రీ క్లినిక్ గురించి ఛైర్మన్ సుబ్బారావు మద్దాలి మాట్లాడారు. దాని ప్రయోజనాలను వివరించి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మీడియా సెక్రటరీ శ్రీనివాస్ రామిశెట్టి ఈ విశేష కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. తామా టీమ్ ప్రియాంక గడ్డం, రాఘవ తడవర్తి, రూపేంద్ర వేములపల్లి, సునీల్ దేవరపల్లి, కృష్ణ ఇనపకుతిక, తిరు చిల్లపల్లి, శశి దగ్గుల, హర్ష కొప్పుల, శ్రీనివాస్ ఉప్పు, పవన్ దేవలపల్లి, కమల్ సాతులూరు, రాజేష్ జంపాల సెమినార్ సజావుగా సాగేందుకు సహకరించారు. ఈ సెమినార్‌ను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Apply Now: ‘సింగిల్ గర్ల్ చైల్డ్’కు సీబీఎస్ఈ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు
-
October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు
-
Rakshit Shetty: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు రక్షిత్ శెట్టి ఫిదా.. ఏమన్నారంటే?
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ