తానా మహాసభలకు జస్టిస్ ఎన్వీ రమణ, మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్..
TANA Conference: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జులై రెండో వారంలో జరగనున్న తానా మహాసభలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సభలను ఈఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తానా ప్రతినిధులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫిలడెల్ఫియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7, 8, 9 తేదీల్లో జరిగే ఈ మహాసభలకు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, సినీ సంగీత డైరెక్టర్లు హాజరవుతున్నారు. ఈ సభలను ఎంతో వైభవంగా నిర్వహించేందుకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరి కొన్ని నెలలుగా ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ మహాసభల నిర్వహణ కోసం ఇప్పటికే పలు కమిటీలను ఏర్పాటు చేశారు. తానా సభలను విజయవంతం చేయడంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను, ఆట పాటల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకు తరలి రావాల్సిందిగా ఎంతోమంది ప్రముఖులను ఇప్పటికే తానా ప్రతినిధులు స్వయంగా కలిసి ఆహ్వానించారు.
తానా మహాసభలకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ, జయభేరి గ్రూపు అధినేత మురళీ మోహన్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు హాజరవుతున్నట్టు అంజయ్య చౌదరి లావు, రవి పొట్లూరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మహాసభలను పురస్కరించుకుని ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అమెరికాలోని వివిధ నగరాల్లో థీమ్ తానా పోటీలను నిర్వహిస్తున్నారు. సోలో సింగింగ్, గ్రూపు డ్యాన్స్, మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా, తానా చిలకా గోరింక పేరుతో వివిధ పోటీలను నిర్వహిస్తున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ‘తానా కల్యాణమస్తు’ పేరుతో వివాహ వేదికను కూడా తానా ఏర్పాటు చేసింది.
తానా సభల సందర్భంగా అమెరికాలోని వివిధ నగరాల్లో ఆటల పోటీలను నిర్వహిస్తున్నారు. తానా ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు. కథాకేళి పేరుతో కథలు చెప్పే పోటీలు.. తానా రీల్స్ పేరుతో ఔత్సాహికుల క్రియేటివిటీని వీడియో రూపంలో ప్రదర్శించే గొప్ప అవకాశాన్ని ఈ సందర్భంగా తానా ప్రతినిధులు కల్పిస్తున్నారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే తానా స్టార్టప్ కార్యక్రమంతో పాటు ఫ్యాషన్ షో, షార్ట్ ఫిలిం వంటి కార్యక్రమాలను, ప్రముఖ కవులతో సాహిత్య సభలు, వాణిజ్యరంగ ప్రముఖులతో సెమినార్లు, శ్రీనివాస కల్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ మహాసభలకు అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తానా మహాసభల పూర్తి వివరాల కోసం తానా అధికారిక వెబ్‌సైట్ https://tanaconference.org/లో చూడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
24సార్లు వినతిపత్రాలు ఇచ్చినా.. వందల సార్లు ఫిర్యాదుచేసినా..!
-
Tirumala Brahmotsavam: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
-
రాత్రివేళ రెండేళ్ల పాప అదృశ్యం.. డ్రోన్లు, జాగిలాలతో పోలీసుల జల్లెడ
-
Vizag: ‘విశాఖ వందనం’ పేరుతో రాజధాని హడావుడి
-
Drugs Case: నటుడు నవదీప్ ఫోన్లలో డేటా మాయం!
-
Chandrababu: ‘బాబుతో నేను’.. చంద్రబాబుకు మద్దతుగా ఉత్తరాల ప్రవాహం