తానా ఫౌండేషన్‌ ‘చేయూత’.. 83 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు..

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ‘చేయూత’ కార్యక్రమం కింద 83 మంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు.

Published : 24 Jan 2022 10:59 IST

కాకినాడ: తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ‘చేయూత’ కార్యక్రమం కింద 83 మంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ‘పడాల ట్రస్ట్‌’తో కలిసి ‘తానా ఫౌండేషన్‌’ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈనెల 20న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గాంధీభవన్‌లో విద్యార్థులకు వీటిని అందించారు. మొత్తం 83 మంది విద్యార్థుల్లో 45 మందికి గత మూడేళ్లుగా స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా వారినే మరోసారి ఎంపిక చేశారు. శశికాంత్‌ వల్లేపల్లి కుటుంబం, ఐశ్వర్య శ్యామ్‌రాజ్‌ ఈ స్కాలర్‌షిప్‌లకు సహకారం అందించారు. 

ఈ సందర్భంగా పడాల ట్రస్ట్‌ ఛైర్మన్‌ సూర్య పడాల మాట్లాడుతూ స్కాలర్‌షిప్‌లు పొందిన విద్యార్థులను అభినందించారు. విద్యలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ‘తానా’ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ‘తానా’ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వెంకటరమణ యార్లగడ్డతో తమకున్న అనుబంధాన్ని ఆయన వివరించారు. ‘తానా’లో తనకు సహకరించిన అందరికీ సూర్య పడాల ధన్యవాదాలు తెలిపారు.  కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని