పెన్సిల్వేనియా, హారీస్‌బర్గ్‌ లో ‘తానా కన్వెన్షన్ కిక్‌ ఆఫ్‌ మీటింగ్‌’కు అనూహ్య స్పందన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్ళకోసారి అంగరంగ వైభవంగా నిర్వహించే మహాసభలు జులై 7,8,9 తేదీల్లో ఫిలదెల్పియాలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్నాయి.

Published : 02 Mar 2023 22:26 IST

పెన్సిల్వేనియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్ళకోసారి అంగరంగ వైభవంగా నిర్వహించే మహాసభలు జులై 7,8,9 తేదీల్లో ఫిలదెల్ఫియాలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ మహాసభలకు ముందు జరిగే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పెన్సిల్వేనియా, హారీస్‌బర్గ్‌ లో ‘తానా కన్వెన్షన్ కిక్‌ ఆఫ్‌ మీటింగ్‌’ జరిగింది.  తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తానా సభ్యులు, శ్రేయోభిలాషులు, దాతలు, ఇతర తెలుగు సంఘాల నాయకులు హాజరై మహాసభల విజయవంతానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. అమెరికాలోని తెలుగువారితో పాటు ఇక్కడి కమ్యూనిటీ, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కూడా తానా సేవలందిస్తున్న విషయాన్ని తెలియజేశారు. ఇక ముందు కూడా కమ్యూనిటీకి అవసరమైన సేవా కార్యక్రమాలతో పాటు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. తానా మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి మాట్లాడుతూ.. తానా మహాసభల్లో పాల్గొనడమే గొప్పగా భావిస్తారని, ఈసారి మహాసభలను ఫిలదెల్ఫియాలో దాదాపు 22 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాసభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలోని తెలుగువారందరిపైనా ఉందన్నారు. మహాసభల విజయవంతానికి సహకరించేందుకు ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో తానా మహాసభల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి మందలపు, కార్యదర్శి సతీష్‌ తుమ్మల, మిడ్‌ అట్లాంటిక్‌ ప్రాంత ప్రతినిధి సునీల్‌ కోగంటి, విల్మింగ్టన్‌ సిటీ కోఆర్డినేటర్‌ లక్ష్మణ్‌ పర్వతనేని, హారీస్‌ బర్గ్‌ సిటీ కోఆర్డినేటర్‌ వెంకట్‌ చిమిలి, శ్యామ్‌ బాబు వెలువోలు, ఆటా మాజీ అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డి, సతీష్‌ చుండ్రు, వెంకట్‌ సింగు, కిరణ్‌ కొత్తపల్లి, రామకృష్ణ పమిడిముక్కల, హను తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆటా, నాటా, టాటా, డాటా, హారీస్‌బర్గ్‌ తెలుగు సంఘం ప్రతినిధులతోపాటు తదితరులు  హాజరై తానా మహాసభలకు తమ తోడ్పాటు ఉంటుందని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని