నంద్యాలలో తానా అధ్యక్షుడు నిరంజన్ పర్యటన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం సేవలు కర్నూలు జిల్లాలో కొనసాగిస్తామని తానా

Updated : 09 Nov 2021 16:44 IST

నంద్యాల: ఉత్తర అమెరికా తెలుగు సంఘం సేవలు కర్నూలు జిల్లాలో కొనసాగిస్తామని తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ ప్రకటించారు. శిరివెళ్ల మండలం రాజానగరానికి చెందిన ఆయన.. తానా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. నంద్యాలలో ఆయనకు పలువురు ఘనస్వాగతం పలికారు. కర్నూలు జిల్లాతో పాటు నంద్యాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నట్టు నిరంజన్ పేర్కొన్నారు. తానా సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.  


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని