TANA: తానా రైతు సదస్సు.. విశిష్ఠ అతిథులు వీళ్లే!
తానా 23వ మహాసభల్లో భాగంగా ‘తానా రైతు సదస్సు’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురిని విశిష్ఠ అతిథులుగా ఆహ్వానించారు.
ఫిలడెల్ఫియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మహాసభల సందర్భంగా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా జులై 9న ఆదివారం ఉదయం 10గంటల నుంచి 12.30గంటల మధ్య ‘తానా రైతు సదస్సు’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, విజయ డెయిరీ కార్పొరేషన్‌కు చెందిన డా.చలసాని ఆంజనేయులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు డా. ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, సినీనటుడు నాగినీడు వెల్లంకి విశిష్ఠ అతిథులుగా హాజరవుతున్నట్టు తానా వెల్లడించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను https://tanaconference.org చూడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: రాజమహేంద్రవరం చేరుకున్న కార్ల ర్యాలీ
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్‌రెడ్డి
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’