TANA: తానా సభలకు బాలకృష్ణ.. న్యూయార్క్‌లో ఘన స్వాగతం

తానా సభల కోసం న్యూయార్క్‌ చేరుకున్న ప్రముఖ సినీనటుడు బాలకృష్ణకు అపూర్వ స్వాగతం లభించింది.

Published : 06 Jul 2023 21:22 IST

న్యూయార్క్‌: ఈ నెల 7వ తేదీ నుంచి 9వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న తానా సభల్లో పాల్గొనేందుకు హిందూపురం శాసనసభ్యుడు, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ అమెరికా చేరుకున్నారు. ఆయనకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ, తానా కాన్ఫరెన్స్ అడ్వైజర్ జానీ నిమ్మలపూడి, సతీష్ మేక తదితరులు స్వాగతం పలికారు. న్యూయార్క్ విమానాశ్రయంలో బాలకృష్ణకు, మోహన కృష్ణ పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం భారీ ర్యాలీగా అక్కడి నుంచి తరలివెళ్లారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు