న్యూయార్క్‌లో వెంకయ్యనాయుడుకు ‘తానా’ అపూర్వ స్వాగతం

తానా మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు న్యూయార్క్‌ చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు అపూర్వ స్వాగతం లభించింది.

Published : 07 Jul 2023 20:34 IST

న్యూయార్క్(అమెరికా): తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మహాసభల్లో పాల్గొనేందుకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అమెరికా చేరుకున్నారు. ఈ సందర్భంగా తానా ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జులై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్ఫియాలో జరిగే తానా మహాసభలకు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఇందులో భాగంగా న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయానికి చేరుకున్న వెంకయ్యకు తానా డైరెక్టర్ వంశీ కోట ఆధ్వర్యంలోని తానా ప్రతినిధి బృందం,  మరికొంతమంది ప్రముఖులు స్వాగతం పలికారు. వెంకయ్యనాయుడుకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన వారిలో మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం, గోరంట్ల పున్నయ్య చౌదరి, సామినేని కోటేశ్వరరావు, గంటా పున్నారావు, రాము కోట, రవి రావి, సుబ్రహ్మణ్యం, ప్రసాద్ చుక్కపల్లి, యలమంచిలి జగదీష్ తదితరులు ఉన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు