తానా ఆధ్వర్యంలో షికాగోలో మహిళా దినోత్సవ వేడుకలు

‘తానా’ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను అమెరికాలోని షికాగోలో ఘనంగా నిర్వహించారు. 

Updated : 15 Mar 2022 11:04 IST

షికాగో: ‘తానా’ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను అమెరికాలోని షికాగోలో ఘనంగా నిర్వహించారు. మార్చి 12న తానా మహిళా సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ డా.ఉమా ఆరమండ్ల కటికి ఆధ్వర్యంలో మిడ్‌వెస్ట్‌లో తొలిసారిగా ఈ వేడుకలు జరిగాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్‌ కౌన్సిల్‌ జనరల్‌ అమిత్‌కుమార్‌, సురభికుమార్‌, కాంగ్రెస్‌ మ్యాన్‌ రాజా కృష్ణమూర్తి, స్టేట్‌ సెనేటర్‌ రామ్‌ విల్లివాలమ్‌ హాజరై మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాంప్‌ వాక్‌లో మహిళలంతా సందడిగా గడిపారు. అనంతరం క్రియేటివ్‌ ఐడియాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఫ్యాషన్‌ షో, డాన్స్ కార్యక్రమాలు అందర్నీ ఆకర్షించాయి. మహిళా దినోత్సవ కార్యక్రమాలకు ప్రణతి త్రిపుర వ్యాఖ్యాతగా వ్యవహరించారు.  

ఈ వేడుకల్లో ‘తానా’ అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, కమ్యూనిటీ కోఆర్డినేటర్‌ రాజా కసుకర్తి, స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ శశాంక్‌ యార్లగడ్డ, ఫౌండేషన్‌ ట్రస్టీ పురుషోత్తం చౌదరి గుడే, తానా మీడియా ఛైర్‌ ఠాగూర్‌ మలినేని, తానా రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ కిశోర్‌ యార్లగడ్డ, నేషనల్‌ కో ఛైర్స్‌ వెంకట్‌ బిత్రా, రామకృష్ణ కృష్ణస్వామి, ఫణి వేగుంట తదితరులు హాజరయ్యారు. షికాగో లోకల్‌ లీడర్స్‌ హేమ కానూరు, యుగంధర్‌ యడ్లపాటి, కృష్ణమోహన్‌, రజినీ ఆకురాతి పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా షికాగోలో కీలక పదవుల్లో ఉన్న మహిళా నేతలను డా.ఉమా ఆరమండ్ల కటికి సన్మానించారు. మరోవైపు అనాథ బాలికల స్థితిగతులను మెరుగుపరిచి వారి భవిష్యత్తు బంగారు బాటలు వేయడానికి తానా ఫౌండనేషన్‌ ప్రోగ్రాం ‘చేయూత’కి 1700 డాలర్లను సేకరించారు. దీంతో ఎంతో మంది బాలికలకు ప్రయోజనం కలగనుంది.

మహిళా దినోత్సవ కార్యక్రమాలకు సహకరించిన హేమ అద్దంకి, ప్రణతి, శాంతి లక్కంసని, శ్రీలత గరికపాటి, సంధ్య అద్దంకి, అనిత కాట్రగడ్డ, శ్రీదేవి దొంతి, కిరణ్‌ వంకాయపాటి, గురుస్వామిలకు డా. ఉమా ఆరమండ్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని