TANA: తానా ‘ధీం-తానా’ పోటీలకు విశేష స్పందన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలో జులై 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి ఆధ్వర్యంలో వీటిని ఘనంగా జరపనున్నారు.

Updated : 23 Jun 2023 07:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలో జులై 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి ఆధ్వర్యంలో వీటిని ఘనంగా జరపనున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే తానా సభలకు ముందు ‘ధీం-తానా’ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

దీనిలో భాగంగా ఈ ఏడాది పెన్సిల్వేనియాలోని వెస్ట్‌ చెస్టర్‌లో జూన్‌ 17న ‘ధీం-తానా’ పోటీలు నిర్వహించారు. దీనికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. జ్యోతి ప్రజ్వలనతో పోటీలు ప్రారంభమయ్యాయి.  క్లాసికల్ సింగింగ్‌, ఫిల్మీ సింగింగ్‌, క్లాసికల్‌ డ్యాన్స్‌, ఫిల్మీ డ్యాన్స్‌, మిస్‌ టీన్‌ తానా, మిస్‌ తానా, మిసెస్‌ తానా, బ్యూటీ పేజెంట్‌, చిలకా గోరింకా పోటీలు సాయంత్రం వరకు కొనసాగాయి. ధీం-తానా పోటీలు సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ అండ్ అడల్ట్స్ క్యాటగిరీల్లో నిర్వహించడం విశేషం. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన విజేతలు ఫిలడెల్ఫియాలో జులై 8 ,9 తేదీలలో జరిగే 23వ తానా మహాసభల ఫైనల్‌లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

యువత ప్రతిభకు పట్టం కట్టే ఈ పోటీలను మిడ్ అట్లాంటిక్ ప్రాంత ప్రతినిధి సునీల్ కోగంటి, ధీం-తానా కో ఛైర్ శ్రీలక్ష్మి కులకర్ణి, ధీం-తానా ఫిలడెల్ఫియా కోఆర్డినేటర్ కృష్ణ నందమూరి తదితరులు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధీం-తానా ఛైర్ మాలతి నాగభైరవ, కో చైర్ సోహిని అయినాలా హాజరయ్యారు. మహాసభలలో భాగంగా జూన్ 4వ తేదీన నిర్వహించిన చదరంగం పోటీ విజేతలకు ఈ కార్యక్రమంలో ట్రోఫీలు అందజేశారు.  ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీలక్ష్మి కులకర్ణి వ్యవహరించారు.  లక్ష్మీ మోపర్తి, విద్య గారపాటి, న్యూజెర్సీ శైలాస్‌ డ్యాన్స్‌ అకాడమీ, హౌస్‌ ఆఫ్‌ బిర్యానీస్‌ అండ్‌ కబాబ్స్‌, భూమి కాఫీ, అపర్ణ వాగ్వల, మాన్విత యాగంటి, బిందు జాస్తి, ఓం కొత్తపల్లి తదితరులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు అంజయ్యచౌదరి లావు, మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి మందలపు, కార్యదర్శి సతీష్‌ తుమ్మల, డైరెక్టర్‌ వంశీ కోట, జాయింట్‌ ట్రెజరర్‌ వెంకట్‌  సింగు, సునీల్‌ కోగంటితో పాటు తానా కార్యవర్గ సభ్యులతో పాటు కిరణ్ కొత్తపల్లి, రవి వీరవల్లి, ఫణి కంతేటి, విశ్వనాథ్ కోగంటి, రంజిత్ మామిడి, రవి తేజ ముత్తు, మోహన్ మళ్ల, రాజేశ్వరి కొడాలి, భవాని కొత్తపల్లి, చలం పావులూరి, మనీషా మేక, రమ్య పావులూరి, సరోజ పావులూరి, గోపి వాగ్వాల, నాయుడమ్మ చౌదరి యలవర్తి, చంద్ర శేఖర్ రావు భాసుట్కార్, సంతోష్ కుమార్ రౌతు, ఉమాకాంత్ రఘుపతి, హరీష్ అన్నాబత్తిన, సనత్ వేమూరి, దశరథ రామయ్య తలపనేని, పార్థ మాదాల, కోటిబాబు యాగంటి, కళ్యాణ్ ఆచంట, హేమంత్ యెర్నేని, మురళి పమిడిముక్కల, శ్రీనివాస్ చెరుకూరి, మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, వెంకట్ చెమ్చా, అరుణ్ రుద్రా, తిరుపతి రావు బైరాపునేని, శ్రీకాంత్ గూడూరు, హరినాథ్ దొడ్డపనేని, సుబ్రహ్మణ్యం ఓసూరు, సాంబయ్య కోటపాటి, రామ ముద్దన, లక్ష్మి, రాజు గుండాల, కోట, శ్రావణి, వెంకట్రావు గూడూరు, కిషోర్ కుకలకుంట్ల, శ్రీ అట్లూరితో పాటు మహాసభల కమిటీ సభ్యులు, వాలంటీర్లను పుష్పగుచ్ఛాలతో వేదికపై ఘనంగా సత్కరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు