టాక్‌ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా బోనాల జాతర

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్‌ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.

Published : 01 Jul 2023 22:40 IST

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్‌ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి సుమారు 1200కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకలకు వ్యాఖ్యాతగా సంయుక్త కార్యదర్శి గొట్టిముక్కల సతీష్ రెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథిగా హౌంస్లౌ నగర మేయర్ ఆఫ్ఝల్ కియానీ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, లండన్‌ వీధుల్లో తొట్టెలను ఊరేగించారు. పోతురాజుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉన్నత చదువుల కోసం లండన్‌ వెళ్లిన ప్రవాస తెలంగాణ విద్యార్థి అక్షయ్‌ మల్చేలం.. వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషధారణతో ఈ వేడుకలకు సరికొత్త శోభను తీసుకొచ్చారు.

యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని హౌంస్లౌ మేయర్ అన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు ప్రశంసనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి, ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మహిళలందరినీ ప్రత్యేకంగా సత్కరించి, బహుమతులు అందజేశారు.

టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం, ప్రపంచంలోని తెలంగాణ బిడ్డల కోసం టాక్‌ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. అందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి, బంగారు తెలంగాణ సకారంలో ఎన్నారైల పాత్ర గురించి అందరికీ గుర్తు చేశారు. వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు వృత్తిపరంగా బిజీగా ఉన్నప్పటికీ, బాధ్యత గల తెలంగాణా బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో, నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర ఎందరికో ఆదర్శంగా ఉందని తెలిపారు. టాక్ సంస్థ బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించి, అన్ని వేళలా తన సూచనలు సలహాలు ఇస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం లేని లోటు ఉన్నా.. ఆమె సహకారం, సూచనలు, స్ఫూర్తి వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు.

సంస్థ ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి మాట్లాడుతూ, టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరూ బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపు చేయడం ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు. ఎన్నారై బీఆర్‌యస్ యూకే అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ దూసరి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్‌లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం ఘర్వంగా ఉందని, ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలు కోరుకుంటున్నారని, నేడు తెలంగాణలో జరిగే అభివృద్ధి దేశమంతా అమలు కావాలంటే కేవలం కేసీఆర్‌ లాంటి నాయకుడి వల్లే అవుతుందంటూ ‘దేస్‌ కా నేత కేసీఆర్‌’ ఎన్నారైలంతా నినదించారు.

కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలని ఘనంగా నిర్వహించి, తెలంగాణ ప్రగతిని దేశానికి తెలిసేలా చేశారని అన్నారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన మహా శక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ తెలంగాణ వంటకాలతో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించారు. టాక్ ముఖ్య నాయకులు జాహ్నవి, హరి గౌడ్ నవపేట్‌, సత్య చిలుముల, రాకేష్ పటేల్, సత్యపాల్ పింగిళి, శ్రీకాంత్, క్రాంతి మాట్లాడుతూ బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషంగా ఉందన్నారు. ఇతర ఎన్నారై సంఘాల యూకే ప్రతినిధులు వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు.

ఈ కార్యక్రమంలో టాక్‌ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, సత్య చిలుముల, అడ్వైజరీ చైర్మన్ మట్టా రెడ్డి, కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్‌పర్సన్‌ నవీన్ రెడ్డి, సత్య చిలుముల, మల్లా రెడ్డి బీరం, రాకేష్ పటేల్, సత్య పింగిళి, హరి నవపేట్, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి, శ్వేతా మహేందర్, రవి రేతినేని, గొట్టిముక్కల సతీష్ రెడ్డి, రవి పులుసు, గణేష్ కుప్పలా, శ్రీకాంత్ జెల్లా, మధుసూదన్ రెడ్డి, రాజేష్ వాకా, శ్రీవిద్య, శ్రావ్య, భూషణ్ ఉప్పల, మౌనిక డూడ్ల్, రంజిత్, విజిత, శ్రీధర్ రావు, గణేష్ పస్తం, శశి, అవినాష్, తేజ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు