ఖతార్‌లో ఘనంగా తెదేపా 40 వసంతాల వేడుకలు

తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలో ఖతార్‌లో ఘనంగా జరిగాయి. ఎన్నారై తెదేపా- ఖతార్ కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో......

Published : 29 Mar 2022 22:02 IST

ఖతార్‌: తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలు ఖతార్‌లో ఘనంగా జరిగాయి. ఎన్నారై తెదేపా- ఖతార్ కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఊహించని రీతిలో పార్టీ 40వ ఆవిర్భావ ఉత్సవాన్ని దిగ్విజయం చేసిన టీడీపీ ఖతార్ కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందించారు. గత పది రోజులుగా గల్ఫ్ దేశాల పర్యటనలో తాను వెళ్లిన ప్రతిచోటా ఆదరణ లభించిందన్నారు. వేదిక, సభాప్రాంగణం అలంకరణ చూసి ముగ్దులై అంతా పసుపుమయంగా ఉందని ప్రశంసించారు. ఏపీ పునర్నిర్మానః జరగాలన్నా.. పోలవరం, అమరావతి నిర్మాణం పూర్తి చేయాలన్నా, యువతకు ఉపాధి లభించాలన్నా ప్రతి కార్యకర్తా తన వంతు కృషిచేసి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పనిచేయాలన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలోకి రావడం అనివార్యమనీ.. పిల్లల బంగారు భవిష్యత్తు ఎంతో అవసరమన్నారు. వైకాపా అరాచకాలను ఎండగట్టారు. ఆయన ప్రసంగం టీడీపీ ఖతార్ కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఈ వేడుకల్ని విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన నరేష్ మద్దిపాటి, రవి పొనుగుమాటి, విక్రమ్ సుఖవాసి, గొట్టిపాటి రమణయ్య,  సత్యనారాయణ మల్లిరెడ్డి, మేష్ దాసరి సహా ప్రతి సైనికుడికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గత పది రోజులుగా కార్యక్రమాలు విజయవంతం కావడంలో కీలక భూమిక పోషించిన ఎన్నారై టీడీపీ విభాగం సమన్వయకర్త రాజశేఖర్ చప్పిడి, కువైట్ టీడీపీ అధ్యక్షులు సుధాకర్‌ రావు కుదరవల్లికి ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సమావేశానికి హాజరైన వారందరికీ నరేష్ మద్దిపాటి అభినందనలు తెలిపారు. తెలుగువారందరి పార్టీ టీడీపీ అన్నారు. 40 వసంతాల తెలుగుదేశం ప్రస్థానం గురించి రవి పొనుగుమాటి చక్కగా వివరించారు. పార్టీ ఎదుర్కొన్న సంక్షోభాలు, ఒడిదొడుకులు, సాధించిన అపూర్వ విజయాలు, అభివృద్ధి- సంక్షేమం గురించి వివరించారు. అలాగే,  పార్టీ విజయంకోసం, చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని సత్యనారాయణ మల్లిరెడ్డి పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి కార్యకర్త ఎండగట్టాలని గొట్టిపాటి రమణయ్య సూచించారు. ప్రతి తెలుగుదేశం కార్యకర్త కార్యోన్ముఖులై ముందుకు సాగాలని శాంతయ్య యలమంచిలి కోరారు. ఈ సమావేశానికి విచ్చేసిన మహిళలు, చిన్నారులను జేవీ సత్యనారాయణ కొనియాడారు. 

తెదేపా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచారు. పలువురు కార్యకర్తలు, తెదేపా అభిమానులు పట్టాభిరాంతో ఫొటోలు దిగి సందడి చేశారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకొని అయన అమెరికా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి విక్రమ్ సుఖవాసి వ్యాఖ్యాతగా వ్యవహరించగా,  రవి పొనుగుమాటి ముగింపు సందేశ ధన్యవాదాలతో కార్యక్రమం  విజయవంతంగా ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని