Chandrababu: తెదేపాను స్థాపించిన ముహూర్త బలం గొప్పది: చంద్రబాబు

తెలుగు చరిత్ర అంటే తెదేపా ఆవిర్భావానికి ముందు.. ఆ తర్వాత అని చదవాల్సిందేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 29 Mar 2022 11:27 IST

అమరావతి: తెలుగు చరిత్ర అంటే తెదేపా ఆవిర్భావానికి ముందు.. ఆ తర్వాత అని చదవాల్సిందేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం 40 దేశాల్లోని 200 నగరాల్లో వేడుకలను జరుపుకొంటోంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో స్థిరపడిన పార్టీ అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెదేపా పుట్టిందని ఆయన గుర్తు చేశారు. సంక్షేమానికి ఆద్యుడు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ అని.. పటేల్‌, పట్వారీ వ్యవస్థలను ఆయన రద్దు చేశారని చెప్పారు. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆహార భద్రత విధానాన్ని రూ.2కే కిలోబియ్యం పథకంతో ఎన్టీఆర్‌ ఎప్పుడో అమలు చేశారని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్‌ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పార్టీ బలోపేతం కానుందన్నారు. తెదేపాను స్థాపించిన ముహూర్త బలం గొప్పదని.. అందుకే ఎన్ని ఆటు పోట్లు వచ్చినా తట్టుకుని నిలబడుతోందన్నారు. పార్టీని ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తోందని చెప్పారు. ఏ దేశంలో ఉన్నా రాష్ట్ర భవిష్యత్‌కు ఎన్‌ఆర్‌ఐలు సహకరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని