కువైట్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిగాయి.

Published : 21 Apr 2022 23:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిగాయి. ఎన్‌ఆర్‌ తెదేపా కువైట్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 20న ఒమరియా గార్డెన్‌లో చంద్రబాబు 72వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలసి కోకు కోసి వేడుకలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సీనియర్ నాయకులు బలరాం నాయుడు, ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్‌ అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి ధన్యవాదాలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని