
Updated : 20 Apr 2021 19:17 IST
మెల్బోర్న్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు
మెల్బోర్న్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో పార్టీ శ్రేణులు, అభిమానులు నిర్వహించారు. ఆయన 71వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేశారు. ఇవాళ విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు చంద్రబాబు ముందుచూపు ఎంతో దోహదపడిందని పలువురు తెదేపా శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రవాసాంధ్రులకు చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తి ఎంతో ఉపయోగపడిందని కొనియాడారు.
Tags :