హ్యాట్‌ఫీల్డ్‌లో ఘనంగా తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలుగుదేశం పార్టీ 40వ వసంతోత్సవంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.

Published : 30 Mar 2022 01:23 IST

ఇంగ్లాండ్‌: తెలుగుదేశం పార్టీ 40వ వసంతోత్సవంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇంగ్లాండ్‌లోని హ్యాట్‌ఫీల్డ్‌లో తెదేపా అవిర్భావ దినోత్సవ వేడుకలు ఉత్సహాంగా సాగాయి. ‘జై నారా చంద్రబాబు’, ‘జోహార్‌ ఎన్టీఆర్‌’ అంటూ అక్కడి తెలుగు ప్రజలు తమ అఖండ అభిమానాన్ని చాటుకున్నారు. కేక్‌ కోసి వేడుకలు నిర్వహించారు. కులం, మతం, ప్రాంతం వీటన్నింటినీ మించిన ‘తెలుగు’ అనే భావనే మనకి గుర్తింపుని తీసుకువచ్చిందని, అది తెదేపాతోనే వచ్చిందనేది తెలుగునేల మీద పుట్టిన ప్రతి బిడ్డా చెప్పే మాటని గుర్తుచేసుకున్నారు.

ఒక ప్రాంతీయ పార్టీ 40 ఏళ్లుగా కొనసాగుతుండడమేకాక దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక ప్రగతిలో తనదైన ముద్రవేసిందని శివరాం కూరపాటి అన్నారు. దేశ రాజకీయాల్లో తెదేపా ఎల్లప్పుడూ కేంద్ర బిందువుగానే ఉంటూ వస్తోందన్నారు. భారతదేశం, జీడీపీ, హెల్త్‌ ఇండెక్స్‌, ఫారెక్స్‌, జ్ఞానం, మహిళా సాధికరత ఇలా దేని గురించి మాట్లాడినా అందులో తెలుగునేల అగ్రభాగాన ఉంటూ వస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశం దాటొచ్చిన ప్రతి తెలుగుగుండెని తట్టిలేపాల్సిన తరుణమిదేని వేడుకల్లో పాల్గొన్నవారు పేర్కొన్నారు. తెదేపాకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావటంలో తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. విభేదాలు వీడి పార్టీ కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మెమోరియల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను సాగర్ కడియాల, రవి కొత్తపల్లి ప్రారంభించారు. ఈ వేడుకల్లో జగదీష్ వీరణా, వంశీ కందుల, తంగరాజ్, సుధాకర్, మణికంఠ, త్రివేది, మోహన్, నాని, జయ్ చంద్, రామ్ ప్రకాశ్ రెడ్డి, ప్రణయ్, పలువురు మహిళలు, చిన్నపిల్లలు పాల్గొన్నారు. రాబోయే అన్నగారి శతజయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున చేయబోతున్నామని, ‘ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు’ అవార్డులు ఇవ్వబోతున్నట్లు వారు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని