యూకే, యూరప్‌లో ఘనంగా తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలు

తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలను యూకే, యూరప్‌ వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు.

Updated : 02 Apr 2022 04:11 IST

డబ్లిన్‌లో తెదేపా ఆవిర్భావ వేడుకలు

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలను యూకే, యూరప్‌ వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి కేకులు కోసి సంబరాలు జరుపుకున్నారు. ఎల్లలు దాటినా మూలాలు మర్చిపోము అని నిరూపిస్తూ.. 40 ఏళ్లే కాదు వందేళ్లు అయినా పార్టీపై ఇలానే అభిమానం చూపిస్తామని పేర్కొన్నారు. తమ ఆరాధ్య దైవం, అభిమాన నటుడు ఎన్టీఆర్‌ స్థాపించిన తెదేపా 40 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూరోప్‌ నాయకులు డా.కిషోర్ బాబు, నవీన్ సామ్రాట్ జలగడుగు, అమర్‌నాథ్‌ పొట్లూరి, శ్యామ్ సుందర్ రావు ఊట్ల, శ్రీనివాస్ గోగినేని తదితరులు పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి అంగరంగ వైభవంగా వేడుకలను జరిపారు. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జై చంద్రబాబు అంటూ వేదికలు మారుమోగేలా చేశారు. తెదేపాను గెలిపించేందుకు ఎంత కష్టమైన పడతామని ప్రతిజ్ఞ చేశారు. 2024లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు తమ శక్తి కొద్దీ కష్టపడతామని పేర్కొన్నారు. 

లండన్‌- సుట్టన్‌లో..

ఇక యూకే, యూరప్‌లో పార్టీ 40వ వసంతోత్సవం వేడుకలను ఆయా దేశాల ఎన్నారై తెదేపా కౌన్సిల్‌ సభ్యులు ఘనంగా జరిపారు. డెన్మార్క్‌లో అమర్నాథ్, బ్రస్సెల్స్‌లో కొండయ్య, శివకృష్ణ, స్వీడన్‌లో ప్రవీణ్, నార్వేలో వేంకటపతి, నెధర్లాండ్స్‌లో వివేక్, ఇటలీలో సతీష్ కుమార్, వీరు, మాల్టాలో అనిల్ గుడిపూడి, దినేష్ పాకలపాటి, సుమంత్‌, వీరూ మేక, ఫిన్లాండ్‌లో రామకృష్ణ, పోర్చుగల్‌లో దశరథ్, ఇంగ్లాండ్‌లో నవీన్ సామ్రాట్, శ్యాంసుందర్ రావు, వెంకట రమణ, శ్రీనివాస్, డా.చంద్రశేఖర్, ఐర్లాండ్‌లో కృష్ణ ప్రసాద్, శివబాబు, భరత్, ప్రముఖ్, లాత్వియాలో మీరా కుమార్, పోలాండ్‌లో చందు తదితరులు తెదేపా ఆవిర్భావ వేడులకను నిర్వహించారు. ఈసందర్భంగా వేదికలను పసుపు పచ్చని తోరణాలతో అలంకరించి జెండాని ఆవిష్కరించారు. 2024లో తాము అభిమానిస్తున్న పార్టీని అధికారంలోకి తెచ్చే వరకు విశ్రమించమని పేర్కొన్నారు. ఎన్‌ఆర్ఐ తెదేపా యూరోప్‌ టీం సభ్యులు స్థానిక తెదేపా నాయకులతో కలిసి ఏపీ రాజధాని కోసం అహర్నిశలు కష్టపడిన రైతులకు అమరావతిలో సుమారు 700 మందికి పైగా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని నగరి, పూతలపట్టులలో అన్నదాన కార్యక్రమం చేశారు. పలు అనాథాశ్రమాల్లో ఒక్కరోజు అన్న వితరణ చేసి మాతృభూమి మీద, తమ అభిమాన పార్టీ మీద అభిమానాన్ని చాటుకున్నారు. 

గాల్వేలో..

కోర్క్‌లో..

పోలాండ్‌లో..

మాంచెస్టర్‌లో..

ఈస్ట్‌ లండన్‌లో..

బెల్జియంలో..

కార్డిఫ్‌లో..

బర్మింగ్‌హామ్‌లో..

బ్లాక్‌పూల్‌లో..

హై వైకోంబ్‌లో..

కోవెన్‌ట్రీలో..

ఇటలీలో..

 హై వైకోంబ్‌లో..

మాల్టాలో..

న్యూ క్యాస్టల్‌లో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు