యూరప్‌ దేశాల్లో ఘనంగా తెదేపా మహానాడు

యూరప్‌ దేశాల్లో తెదేపా మహానాడును ఘనంగా నిర్వహించారు. డా.కిశోర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Published : 29 May 2022 16:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూరప్‌ దేశాల్లో తెదేపా మహానాడును ఘనంగా నిర్వహించారు. డా.కిశోర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. యూరప్‌లోని వివిధ దేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐ తెదేపా నేతలు, కార్యకర్తలు ఆన్‌లైన్‌ ద్వారా వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా దేశాల్లోని తెదేపా కుటుంబసభ్యులంతా సమన్వయంతో బలమైన టీమ్‌గా ఏర్పడి ఈ మహానాడును ఘనంగా నిర్వహించినట్లు యూరప్‌ తెదేపా విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. తెదేపా సీనియర్‌ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పంతగాని నర్సింహప్రసాద్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 2024 ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వచ్చేందుకు అందరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

వివేక్‌ కరియావుల (నెదర్లాండ్స్‌) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమర్నాధ్‌ (డెన్మార్క్‌), వేంకటపతి (నార్వే) ప్రముఖ (ఐర్లాండ్‌), సుమంత్‌, దినేశ్‌ (మాల్టా), సతీశ్‌ (ఇటలీ), సాయి మౌర్య (హంగేరి), ప్రవీణ్‌ (పోలండ్‌), శివకృష్ణ, కొండయ్య (బెల్జియం) తదితరులు పాల్గొని పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. యూరప్‌లోని 25కి పైగా దేశాల్లో తెదేపా విస్తరణ, సోషల్‌ మీడియా ద్వారా ప్రజా చైతన్యం, క్షేత్రస్థాయిలో ప్రచారం, తటస్థంగా ఉన్న స్థానిక యువతను పార్టీ వైపు ఆకర్షితుల్ని చేయడం, సామాజిక సేవను రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం తదితర తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని