లండన్‌లో తెదేపా యూకే ఆధ్వర్యంలో ఘనంగా ‘మహానాడు’

లండన్‌లో తెదేపా యూకే ఆధ్వర్యలో ‘మహానాడు’ను ఘనంగా నిర్వహించారు. యూకేలోని అన్ని ప్రధాన నగరాల

Updated : 29 May 2022 10:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లండన్‌లో తెదేపా యూకే ఆధ్వర్యలో ‘మహానాడు’ను ఘనంగా నిర్వహించారు. యూకేలోని అన్ని ప్రధాన నగరాల నుంచి తెదేపా కార్యకర్తలు, ఎన్టీఆర్‌ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు మహానాడు వేదిక వద్దకు ర్యాలీగా తరలివెళ్లారు. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతంతో కార్యక్రమాలను ప్రారంభించారు.

తొలుత తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిచారు. అనంతరం పార్టీ కోసం ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ రెండు నిమిషాల మౌనం పాటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవిత విశేషాలు, ఆయన పరిపాలన, తెలుగు ఖ్యాతిని దేశ విదేశాల్లో వ్యాప్తి చేసిన తీరును గుర్తు చేసుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీదేవి గుంటుపల్లి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ చేసిన సేవలను కొనియాడారు.

వైకాపా ప్రభుత్వంలో పెరుగుతున్న నిత్యావసరాలు, మహిళలపై లైంగిక వేధింపులు, విద్యుత్‌కోతలు, నిరాదరణకు గురైన విద్య, వైద్య రంగాలపై ఎన్‌ఆర్‌ఐ నేతలు మాట్లాడారు. 2024లో ఏపీలో మళ్లీ తెదేపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తీర్మానించారు. తెదేపా అధినేత చంద్రబాబు జూమ్‌ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పార్టీ పటిష్ఠానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఎన్‌ఆర్‌ఐ నేతలు చేస్తున్న నిబద్ధతను చంద్రబాబు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జయకుమార్ గుంటుపల్లి, వేణు మాధవ్ పోపూరి, శ్రీనివాస్ పాలడుగు, ప్రసన్న నాదెండ్ల, శ్రీకిరణ్ పరుచూరి, నరేష్ మల్లినేని, భాస్కర్ అమ్మినేని, జయరామ్ యలమంచిలి, రవికాంత్ కోనేరు, లగడపాటి శ్రీనివాస్, చక్రి మువ్వ నారాయణ రెడ్డి, సురేష్ కోరం, వీర పరిటాల, చందు నారా, సుందర్రాజు మల్లవరపు, శివరామ్‌ కూరపాటి, కల్యాణ్ కాపు, శ్రీకాంత్ యర్రం, మహేంద్ర తాళ్లూరు, శ్రీధర్ నారా, రవికిరణ్ అరవపల్లి, సురేష్ అట్లూరి, జోషిరావు నర్రా, ప్రభాకర్ అమిర్నేని, శ్రీధర్‌ బెల్లం, వంశీ గొట్టిపాటి, పతంజలి కొల్లి, ఆర్కే రాయపూడి, అజయ్ ధూళిపాళ్ల, రాజశేఖర్ బోడపాటి, జనార్దన్ పోలూరు, వినయ్ కామినేని తదితరులతో పాటు పెద్ద ఎత్తున తెదేపా అభిమానులు, కార్యకర్తలు పాల్గొని మహానాడును విజయవంతం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని