గల్ఫ్ బాధితులకు అండగా నిలిచిన తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు
పొట్టకూటి కోసం సౌదీ అరేబియా వెళ్లి దళారుల చేతిలో మోసపోయిన సిక్కోలు వాసులకు తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అండగా నిలిచారు.
శ్రీకాకుళం: పొట్టకూటి కోసం సౌదీ అరేబియా వెళ్లి దళారుల చేతిలో మోసపోయిన సిక్కోలు వాసులకు తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అండగా నిలిచారు. ఎన్నో ఆశలతో జీవనోపాధి కోసం ఏడారి దేశమైన సౌదీ అరేబియా, డమ్మామ్‌కు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన పలువురు అభాగ్యులు అక్కడి దళారుల చేతుల్లో దగాకు గురయ్యారు. సౌదీలోని పలు కంపెనీల్లో, కాంట్రాక్టు సంస్థలలో పనిచేసేందుకు వెల్డర్ పనులు నిమిత్తం శ్రీకాకుళం నుంచి గత ఏడాది వెళ్లారు. వీసా గడువు పూర్తియినప్పటికీ వారిని తిరిగి స్వదేశానికి వెళ్లకుండా అడ్డుకోవడంతో సిక్కోలు వాసులు అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ గోడును వెళ్లబోసుకుంటూ ఇటీవల ఓ వీడియో కాల్ ద్వారా తమ బంధువులకు సందేశాన్ని పంపించారు.
ఈ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వారికి సాయం చేయాలని అభ్యర్థించారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన గల్ఫ్ టీడీపీ అధ్యక్షుడు రాధాకృష్ణతో మాట్లాడి వారికి అండగా ఉండి భారత్‌కు తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే, భారత రాయబార అధికారులతోనూ మాట్లాడి కావాల్సిన ఏర్పాట్లను చేయించారు. దళారుల చేతుల్లో మోసపోయిన తమకు ఎంపీ రామ్మోహన్ నాయుడు, గల్ఫ్ టీడీపీ అధ్యక్షుడు రాధాకృష్ణ చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేమంటూ బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్