ఏపీ ఎన్నికల్లో తెదేపా గెలుపే లక్ష్యంగా.. ఎన్ఆర్‌ఐ నేతల కీలక సమావేశం

అమెరికాలో ‘తానా’ 23వ సమావేశాల సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూఎస్‌ఏ సమావేశం జరిగింది. ఏపీలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు.

Updated : 13 Jul 2023 13:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో ‘తానా’ 23వ సమావేశాల సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూఎస్‌ఏ సమావేశం జరిగింది. ఏపీలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా కోఆర్డినేటర్‌ జయరాం కోమటి, తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, ఎన్‌ఆర్‌ఐ తెదేపా డాక్టర్స్‌ సెల్‌ రవి వేమూరి, జోన్‌ 2 కోఆర్డినేటర్‌ రవి మందలపు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. 

ఎన్‌ఆర్‌ఐ తెదేపా నేతలను ఉద్దేశించి తెదేపా అధినేత చంద్రబాబు ఇచ్చిన సందేశంపై ఈ సమావేశంలో చర్చించారు. అమెరికాలో తెదేపాకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై జయరాం కోమటి వివరించారు. ఎన్‌ఆర్‌ఐలు తెదేపాకు చేస్తున్న సేవలను ఎంపీ రవీంద్రకుమార్‌ కొనియాడారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం.. అందులో ఎన్‌ఆర్‌ఐల పాత్రపై ఎన్‌ఆర్‌ఐ తెదేపా డాక్టర్స్‌ సెల్‌ తరఫున రవి వేమూరి వివరించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. 

సభ్యులు అడిగిన ప్రశ్నలకు నేతలు సమాధానాలు ఇచ్చారు. సభ్యుల విలువైన సూచనలు, సలహాలను అమలు చేస్తామని చెప్పారు. రవి మందలపు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐ తెదేపా పాత్ర గురించి వివరించారు. ఈ సమావేశానికి సాయి బొల్లినేని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వెంకట్‌ ఆళ్ల, రావు రాళ్లపల్లి, జానకిరామ భోగినేని, సూర్య బెజవాడ, బాలాజీ తాతినేని, వంశీకోట, శ్రీధర్‌ అప్పసాని, రామకృష్ణ వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు