TDP: బ్రిస్బేన్‌లో తెదేపా విజయోత్సవ సంబరాలు!

 ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో క్వీన్స్‌ ల్యాండ్‌ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.

Published : 09 Jul 2024 21:20 IST

బ్రిస్బేన్‌: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమి విజయం సాధించడంపై వివిధ దేశాల్లోని ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జులై 6న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో క్వీన్స్‌ ల్యాండ్‌ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. స్థానిక బెల్‌ బర్డ్‌ పార్క్‌, విక్టరీ చర్చిలో జరిగిన ఈ వేడుకలకు టాలీవుడ్‌ నటుడు శివాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లల ఆటపాటలు, మ్యాజిక్ షో, ఫేస్‌ పెయింటింగ్‌, బెలూన్ ట్విస్టింగ్ తదితర కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఈ విజయోత్సవ సంబరాలకు ఆస్ట్రేలియాలోని పలువురు ఎన్నారైలు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. క్వీన్స్ ల్యాండ్‌ తెదేపా కమిటీ అధ్యక్షుడు విశ్వ దాసరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అందరికీ రుచికరమైన ఆంధ్రా విందు భోజనం ఏర్పాటు చేశారు. క్వీన్స్ ల్యాండ్ తెదేపా కమిటీ సభ్యులు దత్తాత్రేయ బొమ్మసాని, మాధవ్ జొన్నలగడ్డ, భరద్వాజ్ చింతపల్లి, ప్రసాద్ దబ్బర్, నాగార్జున యడ్ల, వంశీ చందు పుట్టగుంట, రామ కృష్ణ గూడూరు, భార్గవ సత్య దాసరి, రాజేష్ కణికంటి, రవి చౌదరి గడ్డిపాటి, సాయి కృష్ణ వడ్డే, రూపా మనోహర్ అరే, మణి గొట్టుముక్కల, పార్థసారథి నున్న, ప్రసాద్ కోనేరు, గౌతం మంచికలపూడిలు తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి కృషి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని