గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా ‘టీచర్స్‌ డే’ వేడుకలు

భారతదేశంలో ఏటా సెప్టెంబర్ 5న (డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి రోజు) నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాలన్నీ కలిసి ఘనంగా నిర్వహించాయి......

Published : 06 Sep 2021 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతదేశ వ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 5న (డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి రోజు)నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాలన్నీ కలిసి ఘనంగా నిర్వహించాయి. ఆయా దేశాలలోని పలు పాఠశాలల్లో బోధిస్తున్న పలువురు అధ్యాపకులు, తెలుగు, భగవద్గీతలాంటి అంశాలను బోధిస్తున్న ఉపాధ్యాయులు 75 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వెంకప్ప భాగవతుల వ్యాఖ్యాతగా  వ్యవహరించగా.. వివిధ దేశాల్లోని ఉపాధ్యాయులను సభకు పరిచయం చేసే కార్యక్రమాన్ని కువైట్ నుంచి సుధాకరరావు, ఖతార్ నుంచి శ్రీసుధ, శిరీష, బెహ్రెయిన్‌ నుంచి జగదీశ్‌, ఫుజైరియా నుంచి మంజుల, అబుధాబి నుంచి విజయ ప్రసాద్, ఒమన్ నుంచి చైతన్య సూరపనేని, అరుంధతి, శ్రీదేవి నిర్వహించారు. 

ఈ సందర్భంగా గల్ఫ్ దేశాలలోని ఉపాధ్యాయులు తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు. అలాగే ఈ కార్యక్రంలో పాల్గొన్న ఉపాధ్యాయులందరినీ అభినందిస్తూ నిర్వాహకులు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమ నిర్వాహకులు సుధాకర రావు మాట్లాడుతూ.. ఇలా తొలిసారి గల్ఫ్‌ దేశాల్లోని ఉపాధ్యాయులను తెలుగు సంఘాలన్నీ కలిసి సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన తెలుగు సంఘాల అధ్యక్షులు తెలుగు కళా సమితి -బహ్రెయిన్‌ శివ ఎల్లపుతో పాటు తెలుగు కళా సమితి- ఒమన్‌ అనిల్‌ కుమార్‌, ఆంధ్ర కళావేదిక- ఖతార్ సత్యనారాయణ, సౌదీ తెలుగు అసోసియేషన్‌- దీపిక రావి, తెలుగు తరంగిణి - వెంకట సురేష్, తెలుగు కళా స్రవంతి- ప్రుథ్వీరాజ్, ఫుజైరాహ్ తెలుగు కుటుంబాలు - వేదమూర్తి తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు,  చిన్నప్పట్నుంచి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, వృత్తిలో అన్నివిధాలా సలహాలు, సూచనలు ఇచ్చిన పైఅధికారులకు, అన్ని విషయాల్లోనూ తీర్చిదిద్దే జీవిత భాగస్వాములకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. వారందరికీ శిరస్సు వంచి పాధాభివందనం చేస్తున్నానన్నారు. ఈ డిజిటల్ కార్యక్రమానికి విక్రమ్‌ సుఖవాసి సాంకేతిక సహకారం అందించినట్టు నిర్వాహకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని